Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కథ మొత్తం చివర్లో ఉన్నట్లు అనిపించడంతో..సీన్స్ బాగా హైలెట్ అవుతున్నాయి. రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మోనితను కార్తీక్ చంపాడని అనుకోని రోషిణి అరెస్టు చేసి జైల్లో వేస్తుంది. ఇక తన తండ్రిని జైల్లో ఎందుకు వేశారని పిల్లలు ప్రశ్నలు వేస్తుంటారు. నాన్న ఎప్పుడు వస్తాడు అంటూ తెగ ఏడుస్తారు. దీప మాత్రం ఏం తెలీదు అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది. మరోవైపు భాగ్య మురళి కృష్ణతో ఇదంతా తన వల్లే జరిగిందని బాధపడుతుంది. మురళీకృష్ణ అందులోని తప్పేముంది నీకు వినిపించింది మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు కదా అంటాడు.
ఇక నిజంగానే కార్తీక్ మోనితను చంపాడా అని మురళీకృష్ణ ప్రశ్నించగా.. మోనిత చేసిన నేరాల గురించి బయటపెట్టడంతో కార్తీక్ కోపంతో రగిలిపోయాడని తర్వాత జరిగిన విషయాన్ని తెలిపింది. ఆనందరావు కార్తీక్ అరెస్టు గురించి తలుచుకొని బాధపడుతుంటాడు. ఆదిత్య ఆనందరావుని చూసి భయపడుతూ ధైర్యం చెబుతాడు. అంతలోనే సౌందర్య ఆదిత్య కి ఫోన్ చేసి నేను వస్తున్నానని తెలుపుతుంది. ఇక తన తల్లికి ఈ విషయం తెలిస్తే ఏమౌతుందో అని టెన్షన్ పడతాడు.ఇక భాగ్యం తను అలా చెప్పినందుకు దీప దగ్గరికి వెళ్లి బాధపడుతుంది. ఇక పిన్ని నువ్వేమి విన్నావు అదంతా చెప్పు అనేసరికి భాగ్యం జరిగిందంతా చెప్పేస్తుంది. ఇక దీప అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది.
దీపని చూసిన రోషిణి ఎందుకు వచ్చావు అన్నట్లు ప్రశ్నిస్తుంది. తన భర్త కోసం వచ్చాను అంటూ సమాధానమిస్తుంది దీప. ఇంకా నీ భర్త మీద నీకు నమ్మకం ఉందా అంటూ ప్రశ్నిస్తుంది. అవ్వన్ని మాటలు పట్టించుకోకుండా డాక్టర్ బాబు లేని జీవితం నాకు వద్దని రోషిణితో అంటుంది.ఇక దీప ఏడుస్తూ నా భర్తతో మాట్లాడే అవకాశం ఇవ్వమని కోరాగానే వెంటనే మాట్లాడమని అంటుంది. దీప రాకను చూసి కార్తీక్ ఎందుకు వచ్చావు దీపను ప్రశ్నిస్తాడు. నా కష్టాలను, బాధలను చూసి నువ్వు బాధ పడతావా అని అంటాడు. ఎందుకిలా చేశావు అని.. ఆ భారతి ఫ్రెండ్ మోనితనేనా అని ప్రశ్నిస్తోంది. మోనితను నిజంగానే చంపేశారా అని అడుగుతుంది.
మరోవైపు వీరి మాటలను రికార్డు చేస్తూ ఉంటుంది రోషిణి. కార్తీక్ అక్కడ జరిగిన విషయాలన్నీ దీపతో చెబుతాడు. కోపంతో ఒకసారి షూట్ చేస్తున్న సమయంలో ప్రియమణి వచ్చి గన్ ను పక్కకు జరిపిందని, మరోసారి షూట్ చేస్తే మోనిత చేతికి గాయమైందని తెలుపుతాడు. ఇక తనను హాస్పిటల్ కి కారులో తీసుకెళ్లినప్పుడు రక్తపు చుక్కలు పడ్డాయని..కానీ అదివరకే మోనిత తప్పించుకుందని కానీ నేను ఏం చేయలేదని చెబుతాడు. ఇక సౌందర్య రోషిణి దగ్గరికి వచ్చి నా కొడుకు తప్పు లేదు అంటూ లొంగిపోతాను అని అనేసరికి రోషిణి కార్తీక్ మాటలు బట్టి తనకు కూడా అనుమానం ఉందని సౌందర్యతో అంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka