Home /News /movies /

Karthika Deepam: నేను మత్తులో ఉన్న దీప.. ఆ పని చేసినట్టు మోనిత చెప్పేవరకు నాకు తెలీదు!

Karthika Deepam: నేను మత్తులో ఉన్న దీప.. ఆ పని చేసినట్టు మోనిత చెప్పేవరకు నాకు తెలీదు!

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎటు అర్థంకాని పరిస్థితిలో కనిపిస్తుంది. ఇక చాలా వరకు ఈ సీరియల్ బాగా ట్విస్టులతో రావడంతో ఇంకెప్పుడు దీప, కార్తీక్ లు కలుస్తారో అని తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎటు అర్థంకాని పరిస్థితిలో కనిపిస్తుంది. ఇక చాలా వరకు ఈ సీరియల్ బాగా ట్విస్టులతో రావడంతో ఇంకెప్పుడు దీప, కార్తీక్ లు కలుస్తారో అని తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక పార్కులో దీప అన్న మాటలకు అక్కడి నుంచి సౌందర్య వెళ్ళిపోతుంది. దీప ఇంటికి వచ్చేసరికి కార్తీక్ పిల్లలకు తినిపించి తాను కూడా తింటాడు. అదే సమయంలో దీప రావడంతో టిఫిన్ చేయమని అనడంతో వెంటనే మోనిత ఎంట్రీ ఇస్తుంది. ఇక వాళ్లంతా షాక్ అవగా నేరుగా వచ్చి టిఫిన్ చేస్తూ తన మాటలతో మరింత బాధ పెడుతుంది. అంతేకాకుండా గోడ మీద మరో గీత కట్ చేసి వెళ్ళిపోతుంది.

    సౌందర్య ఇంటికి వెళ్ళు పరువు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. ఇక మోనిత ఇంటికెళ్లి దీప తనలో దేని కంటే ఎక్కువ, కార్తీక్ దీపనే ఎందుకు ఇష్టపడుతున్నాడని ప్రియమణితో ప్రశ్నించడంతో ప్రియమణి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. ఇక వారణాసి దీప దగ్గరికి వచ్చిన మోనిత తమ్ముడు అని పిలిచాడని ఏ కష్టం వచ్చినా దీపని చూసుకోమన్నదని తెలుపుతాడు. కార్తీక్ ఆ మాటలు విని దీపకు ధైర్యం చెబుతున్న సమయంలో పిల్లలు వారిని ఫోటో దింపుతారు.

    ఇక పిల్లలు మనం ఇక్కడే ఉందాము అని కార్తీక్ తో మాట్లాడతారు. ఇక సౌర్య.. అందరం కలిసి ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు అని అనడంతో కాసేపు ఎమోషనల్ గా సాగుతుంది. దీప సౌర్య మాటల గురించి ఆలోచిస్తూ.. గోడ పై గీసిన గీతల గురించి ఆలోచిస్తుంది. కార్తీక్ దీప వైపు దిగులుగా చూస్తాడు. ఇక సౌర్య తాము ఉంటున్న ఇల్లు కొనాలని కార్తీక్ తో కోరగా కార్తీక్ ఇల్లు కొనే ఆలోచనలో పడతాడు. మొత్తానికి కార్తీక్.. దీప పిల్లలతో కలిసి ఇక్కడే సెటిల్ అయిపోగా మోనిత కూడా ఎప్పుడో ఈ ఇంట్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Deepa, Doctor babu, Karthik, Karthika Deepam serial, Monitha, Nirupam paritala, Premi vishwanth, Star Maa, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు