హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: జైలుకు వెళ్లిన మోనిత.. జాలిపడుతున్న సిగ్గులేని వంటలక్క.. జైల్లోను రత్నసీతతో ప్లాన్లు.. వామ్మో!

Karthika Deepam: జైలుకు వెళ్లిన మోనిత.. జాలిపడుతున్న సిగ్గులేని వంటలక్క.. జైల్లోను రత్నసీతతో ప్లాన్లు.. వామ్మో!

karthika deepam

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. పైగా ప్రస్తుతం కథ మొత్తం చివరికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక లాయర్ రోషిణిని పిలిపించి విచారణ జరుపుతాడు.

ఇంకా చదవండి ...

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. పైగా ప్రస్తుతం కథ మొత్తం చివరికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక లాయర్ రోషిణిని పిలిపించి విచారణ జరుపుతాడు. రోషిణి కూడా కార్తీక్ గురించి విరుద్ధంగా మాట్లాడుతుంది. ఇక విచారణలు ముగిసాయి అంటూ జడ్జి తీర్పు క్లోజ్ చేస్తున్న సమయంలో దీప ఎంట్రీ తన భర్త తప్పు చేయలేదు అంటూ మోనిత బ్రతికే ఉంది అని మోనితను పిలుస్తుంది. వెంటనే మోనితను చూసిన రోషిణి షాక్ అవుతూ కోపంతో రగిలిపోతుంది. ఇక సౌందర్య, ఆనందరావు, ఆదిత్య ఆనందంలో మునిగిపోతారు.

దీప దగ్గరికి వచ్చి దీపను పొగుడుతారు. ఇక మోనిత బోన్లో నిల్చొని కార్తీక్ తప్పు చేయలేదు అంటూ.. నేను అతన్ని ప్రేమించాను అంటూ తను చేసిన నేరాల గురించి ఒప్పుకుంటుంది. తను గర్భం గురించి మాట్లాడుతూ కార్తీక్ పై ప్రేమతో అలా చేశాను అంటూ అలా అయిన నన్ను పెళ్లి చేసుకుంటాడని ఉద్దేశంతో అలా చేశాను అంటూ వివరిస్తుంది.

మరోవైపు రోషిణి మోనితను కోపంగా చూస్తుంది. ఇక మోనిత ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను అంటూ అందుకే ఇలా చేశాను అంటూ కార్తీక్ కు శిక్ష పడద్దు అని వచ్చి నిజాలు బయట పెడుతున్నాను అంటూ అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. జడ్జి మాట్లాడుతూ మోనితను ఇలా ఎందుకు చేశావు అంటూ కోప్పడుతాడు. ఇక న్యాయపరమైన వృత్తిలో ఉన్న డాక్టర్ కార్తీక్ ను విచారించే ముందు పోలీసులు సాక్ష్యాలతో నిరూపించాలి కానీ ఇటువంటి తప్పుడు ఉద్దేశాలతో శిక్ష పడేట్లు చేయడం సరైనది కాదు అంటూ రోషిణి పై కోపడతాడు జడ్జి. ఇక డాక్టర్ కార్తీక్ ఎటువంటి తప్పు చేయలేదు అంటూ సాక్ష్యాలు బయటపడ్డాయని.. కార్తీక్ దోషి కాదు నిర్దోషి అంటూ తీర్పు ఇవ్వడంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు.

ఇది కూడా చదవండి:జైల్లో మోనిత... నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ బాబు.. సీరియల్‌కు శుభం కార్డు?

కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఇక డాక్టర్ కార్తీక్ పై మోపినందుకు మోనిత ను అదుపులోకి తీసుకొని పోలీసులు మరోసారి విచారణ చేయాలి అంటూ తీర్పు ఇస్తాడు. సరైన సమయంలో శ్రీమతి దీప సాక్ష్యం తీసుకొచ్చి న్యాయం జరిపించినందుకు ఆమెను కోర్టు అభినందించింది. రోషిణి కూడా దీప గొప్పదనానికి ఫిదా అవుతుంది. ఇక తీర్పు అనంతరం దీప తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగా మోనిత వచ్చి అప్పుడే శుభం కార్డు పలికింది అనుకోకండి అసలైనది ఇంకా ఉంది అంటూ నా కడుపులో బిడ్డ వచ్చాక వస్తాను అంటూ వెళ్లిపోతుంది.

ఇది కూడా చదవండి:గెలిచింది.. వంటలక్క గెలిచింది.. మోనితను కోర్టు బోనులో నిలబెట్టిన దీప.. సీరియల్‌కు త్వరలోనే శుభం కార్డు?

ఇక రోషిణి మోనితను విచారణ జరుపుతుంది. మోనిత మాత్రం కార్తీక్ ను దక్కించుకోవడానికి దిగజారనని అంటుంది. ఇక జీవిత కాలం శిక్ష పడుతుంది అంటూ రోషిణి అంటున్న కూడా అయినా పరవాలేదు ఎప్పటికైనా కార్తీక్ నే పెళ్లి చేసుకుంటాను అంటూ గట్టిగా చెబుతోంది. రోషిణి కార్తీక్ కుటుంబానికి జరిగిన బాధ గురించి మాట్లాడుతుంది. మోనిత మాట్లాడుతూనే ఉండగా రేపు మాట్లాడుకుందాం అని పంపిస్తుంది. ఇక కార్తీక్, దీప పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఇక పిల్లలు గతంలో దీప చెప్పినా మాటలు తన తండ్రితో మాట్లాడుతారు. మిమ్మల్ని వదిలేసిన పోలీసులు మోనితను ఎందుకు వదిలేయలేదు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. దీప వాటిని గుర్తుకు చేయకండి అంటూ చెబుతుంది. తరువాయి భాగం లో మోనిత గురించి దీప మాట్లాడటంతో కార్తీక్ దీప పై అరుస్తాడు. మోనిత జైల్లో ఉండి రత్నసీతతో మరో ప్లాన్ గురించి తెలుపుతుంది.

First published:

Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Rathna Seetha, Roshini, Shobashetty, Soundarya, Vantalakka

ఉత్తమ కథలు