Home /News /movies /

DOCTOR BABU REALIZES HE NOT DONE ANY MISTAKE WITH VANTALAKKA IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR

Karthika Deepam: నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎందుకు భయపడాలి.. దైర్యం తెచ్చుకున్న డాక్టర్ బాబు?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ షాకింగ్ ట్విస్ట్ లతో మళ్లీ ఆకట్టుకుంటుంది. ఈ వారం ఏమవుతుందో అని బాగా ఆతృతగా చూస్తున్నారు ప్రేక్షకులు.

    kaKarthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ షాకింగ్ ట్విస్ట్ లతో మళ్లీ ఆకట్టుకుంటుంది. ఈ వారం ఏమవుతుందో అని బాగా ఆతృతగా చూస్తున్నారు ప్రేక్షకులు. కొన్ని రోజులనుండి రేటింగ్ తగ్గడంతో మోనిత ఇచ్చిన సమయం దగ్గర పడటంతో ఏం జరుగుతుందా అని మళ్లీ ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. కార్తీక్ దీప ముందు తన బాధను మొత్తం చెప్పుకుంటూ అదే సమయంలో పిల్లలు రావడంతో ఆపేసి వెళ్తాడు. ఇక దీప పిల్లల్ని ఎక్కడికెళ్ళారని ప్రశ్నించగా మీరిద్దరూ ఎందుకు ఇలా ఉంటున్నారోనని అమ్మమని అడగటానికి వెళ్లామని అనడంతో వెంటనే దీప షాక్ అవుతూ ఏం చెప్పిందని ప్రశ్నిస్తుంది. వారంలో కలిసిపోతారని అన్నదని పిల్లలు సమాధానమిస్తారు.

    ఇక కార్తీక్ ఆ తప్పు ఎలా జరిగిందని అసలు అంత ఎలా తాగాను అని ఆలోచిస్తుంటాడు. ఇక దీప కూడా కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉండగా.. సౌందర్య ఫోన్ చేసి కార్తీక్ తనతో చెప్పింది దీపకు తెలుపుతుంది. దీప వెటకారంగా మాట్లాడటంతో సౌందర్య ఏమనలేక వాడిని నమ్ము అంటూ కట్ చేస్తుంది. మరోవైపు మోనిత, ప్రియమణిలు చీరల ముందు వేసుకొని కార్తీక్, దీప, సౌందర్య గురించి మాట్లాడుతుంటారు. ఉదయం ముఖ్యమైన పని ఉందంటుంది మోనిత. ఇక దీప ఆలోచనలో మునుగుతుంది. వారణాసికి ఫోన్ చేసి ఏదో చెబుతుంది. ఇక పిల్లలు డాడీ వచ్చేదాకా తినము అనడంతో మీ డాడీ కి లేట్ అవుతుందని అబద్ధం చెబుతుంది.

    అదే సమయానికి కార్తీక్ రావడంతో గట్టిగా నిలదీస్తారు పిల్లలు. ఇక దీప తన తప్పును సరిదిద్దుకోవడానికి కార్తీక్ తో మాట్లాడుతుంది. ఇక కార్తీక్ కూడా దీపను ఇరికించే ప్రయత్నం చేస్తాడు. ఇక పిల్లల కోసం నవ్వుతూ నటిస్తారు. ఇక కార్తీక్ మళ్లీ ఆలోచనలో మునుగుతూ తనలో తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది నేను.. ఇది నా జీవితం అంటూ.. నా మీద నమ్మకం ఉంది.. నేనేం తప్పు చేయలేదు.. ఎందుకు తలదించుకోవాలి అని తనలో తాను రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తే కార్తీక్ మోనిత ఆశలన్నీ నిరాశలు చేసేలా ఉన్నట్లు అనిపిస్తుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Archana, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Vishwanath, Shoba shetty, Star Maa, Vantalakka

    తదుపరి వార్తలు