Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 7:30 అయిన వెంటనే కార్తీకదీపం సీరియల్ ముందు వాలిపోతారు. ఇక ఇప్పటికే ఈ సీరియల్ 1000 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నా కూడా.. రేటింగ్ విషయంలో ఈ సీరియల్ అత్యధిక స్థానంలో ఉంది. ఇక ఈ సీరియల్ ఒకటే కథపై ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ సీరియల్ కాస్త ఆసక్తి గా మారగా.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ లో దీప ఆరోగ్యం క్షీణించి పోతున్నా సంగతి తెలిసిందే. ఇక దీప ఆరోగ్యంపట్ల కార్తీక్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. దీంతో కార్తీక్ దీప కు మరింత దగ్గరగా అవ్వగా ప్రేక్షకులకు మరింత ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే దీప అనారోగ్యానికి కారణం పాయిజన్ అని కార్తీక్ తెలుసుకున్నాడు.
శ్రీరామనవమి సందర్భంగా ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కూతుళ్లతో కలిసి పూజ చేయించాలి అనుకుంటుంది భాగ్యం. ఇక ఈ విషయం గురించి సౌందర్య తో చెప్పి వాళ్ళని తమ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుంది. ఇది విన్న కార్తీక్ దీపని తప్ప అందరూ తీసుకెళ్ళమని చెప్పగా.. వెంటనే సౌందర్య సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ కార్తీక్ ఏమాత్రం వినకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక దీపకు మోనిత ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి పలకరిస్తూ.. దీపని విసిగిస్తుంది.
ఇక మోనిత దీపకి ఫోన్ చేసిన సంగతిని తెలుసుకున్న సౌందర్య.. దీపను అడుగుతుంది. ఇక కార్తీక్ మోనిత తో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న సౌందర్య.. ఈ విషయం గురించి అడిగేస్తాను అంటుంది. ఇక కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లగా.. దీప్ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తుంది. ఇక వెంటనే కార్తీక్ ఇప్పుడే డాక్టర్ ను కలిసి వస్తున్నాను అంటూ, ఆమె ఒక షాకింగ్ విషయం చెప్పింది అని అంటాడు.
వెంటనే మోనిత ఆ విషయం గురించి ప్రశ్నించగా.. దీప అనారోగ్యానికి కారణం ఆమె శరీరంలో ఏదో రాంగ్ డ్రగ్ ఇంజెక్ట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పిందని తెలుపుతాడు. ఇది విన్నాక మోనిత.. గతంలో దీప డెలివరీ టైంలో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ ఈ విషయం కార్తీక్ తెలిస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంది. కానీ కార్తిక్ మాత్రం ఏ డ్రగ్ కారణం అయి ఉండదు, తను వంటలు చేయడం వల్లే ఇలా జరిగిందని అంటాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka