Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను బాగా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే దీప.. ఆనందరావు తో కార్తీక్ గురించి మాట్లాడుతూ బాధపడుతుంది. తను మోనితను చూసిన విషయాన్ని కార్తీక్ తో చెప్పాలని బయల్దేరుతుంది. ఇక మోనిత కూడా ఓ ప్లాన్ చేసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది. అక్కడే నిలబడి కార్తీక్ ను చూస్తూ తను కార్తీక్ తో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుంటుంది. వెనుకాలే దీప కూడా రావడంతో.. ఈమె కూడా ఇప్పుడే రావాలా అని కోపంగా అనుకుంటుంది మోనిత. ఇక మోనిత తలపై తన చీర కొంగు వేసుకొని అక్కడున్న వాళ్లందరికీ టీ ఇస్తుంది. దీప కార్తీక్ దగ్గరికి వెళ్లి.. గుడిలో మోనితను చూసిన విషయాన్ని చెబుతుంది. కానీ కార్తీక్ మాత్రం అదే ఆలోచనలో ఉన్నావు అంటూ అందుకే నీకు అలా అనిపిస్తుంది అని దీపతో అంటాడు. ఇక దీప మాత్రం నిజమే అని ఎంత చెప్పినా కూడా కార్తీక్ నమ్మలేకపోవడంతో దీపను ప్రశాంతంగా ఉండమని కోరుతాడు.
పక్కనే ఉన్న మోనిత వీరి మాటలను వింటూ అందరికీ టీ అందిస్తుంది. ఇక కార్తీక్ దగ్గరికి మోనిత రాగానే.. రత్న సీత పంపిందా అని అడుగుతాడు. మోనిత తను మూగ అమ్మాయిల రత్న సీతతో చెప్పించిన సంగతి తెలిసిందే. కార్తీక్ కు టీ ఇస్తున్న సమయంలో మేడమ్ కి ఇవ్వు అని దీపను చూపిస్తాడు. ఇక దీపకు టీ ఇస్తున్న సమయంలో గ్లాసు పడిపోతుంది.
ఇది కూడా చూడండి: ఆకుపచ్చ లంగాఓణిలో మెరిసిపోతున్న మోనిత.. ఎంత అందంగా ఉందొ!
వెంటనే అక్కడున్న పోలీసులు వచ్చి మోనితపై ఎవరు నువ్వు అంటూ అరుస్తాడు. తను సమాధానం చెప్పకపోయేసరికి తను మూగ అమ్మాయని చెబుతాడు కార్తీక్. పోలీస్ కార్తీక్ పై అరవడంతో.. ఇదంతా నా వల్లే కార్తీక్ అనుకుంటూ బాధపడుతుంది మోనిత. కార్తీక్ టీ ఇస్తూ కార్తీక్ ను తాకుతుంది. టీ తాగుతున్న కార్తీక్ ను చూస్తూ గ్లాస్ తీసుకొని వెళ్తున్న సమయంలో అక్కడున్న పోలీస్ ఆ గాజు ముక్కలను తీసి పడేయ్ అని అరుస్తాడు.
ఇది కూడా చదవండి: మోనిత బతికే ఉంది.. నిజం చెప్పిన నమ్మని కుటుంబం.. డాక్టర్ బాబు కూడా అదే మాట!
మోనిత వెళ్ళి గాజు ముక్కలు తీసుకొని వెళ్తుండగా తన కాలికి గాజు గుచ్చుకోవడంతో అమ్మ అని అరుస్తుంది. వెంటనే కార్తీక్ మూగ అమ్మాయి కదా ఎలా అరిచిందని అనుకుంటూ.. ఆ స్పర్శలను, ఆమె పర్సనాలిటీని చూసి గుర్తుపట్టి మోనితనే అనుకుంటాడు. కానీ ఆ విషయాన్ని దీపకు చెప్పకుండా ఉంటాడు. మరోవైపు రోషిణి మోనిత గురించి ఓ డాక్టర్ ను ఎంక్వయిరీ చేస్తుంది. ఇక పిల్లలు తల్లి గురించి ఎదురుచూస్తూ వాళ్లు మాట్లాడుతున్న మాటలకు సౌందర్య అరుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acp roshini, Doctor babu, Karthika deepam, Rathna Seetha, Rowdy durga, Soundarya, Vantalakka