Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ శుభం కార్డు పలుకుతుందనుకునే సమయంలోనే మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది. ఇప్పటికే ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ సీరియల్ మళ్లీ కొత్త ట్విస్ట్ తో ప్రేక్షకులను తల పీక్కునేలా చేస్తున్నాడు డైరెక్టర్. పూజ సమయంలో ఎంట్రీ ఇచ్చిన మోనిత.. సౌందర్య తో తాను కార్తీక్ వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని తెలిపింది. ఇక ఈ మాట విన్న ఇంట్లో వాళ్లంతా షాక్ అవ్వగా సౌందర్య.. మోనిత పై గట్టిగా అరిచింది. షాక్ తిన్న కార్తీక్ కూడా మోనిత పై గట్టిగా అరుస్తాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ అరుస్తాడు.
ఇన్ని రోజులు నీ గురించి అమ్మ, దీప ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను పైగా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన పిలవని పేరంటంలా వస్తావ్ అంటూ ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావ్ అని ఆవేశంలో పొంగిపోతాడు కార్తీక్. ఇక మోనిత ఏడుస్తూ నిజం మాట్లాడుతున్నాను అంటుంది. కానీ కార్తీక్ మాత్రం షటప్ అండ్ గెటవుట్ అంటూ బాగా అరుస్తాడు. కానీ మోనిత మాత్రం ప్రెగ్నెంట్ విషయం ఇవాళ కాకుండా రేపైనా తెలుస్తది అంటూ.. డీఎన్ఏ టెస్ట్ లు చేస్తే అసలు విషయం బయటపడుతుందని గట్టిగా మాట్లాడుతుంది. నువ్వే నా ప్రెగ్నెన్సీకి కారణమంటూ కార్తీక్ తో అంటుంది.
ఇక దీప పరిస్థితి మాత్రం చెప్పలేం. షాక్ లో ఉంటూ తల కిందకు వంచి నోరు విప్పకుండా నిలబడింది. ఇక మోనిత దీపకు సారీ చెబుతోంది. ఇన్ని నిందలు ఎలా తట్టుకున్నావ్ అంటుంది. ఇక సౌందర్య తో న్యాయం చేయండి అంటూ మాట్లాడుతుంది. ఇక మురళి కృష్ణ కార్తీక్ ముందు వచ్చి తన బాధలను బయటకు కక్కుతున్నాడు.దీప గురించి బాగా కుమిలిపోతాడు. ఇలాంటి కొడుకుని కన్నావమ్మా అంటూ సౌందర్య తో అంటాడు. ఇక ఈ అవమానం తట్టుకోవడం కష్టం అంటూ ఇకనుండి వెళ్ళిపోదాం వీళ్ళకి దూరంగా వెళ్లిపోదాం అంటూ దీపతో అంటాడు. ఇక దీప కార్తీక్ వైపు అలాగే చూస్తుంది. మరి దీప మళ్లీ కార్తీక్ కు దూరం అవుతుందా లేదా మోనిత కుట్ర గురించి తెలుసుకొని నిలదీయడానికి ఉంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika deepam, Monitha, Premi vishwanth, Vantalakka