Karthika Deepam: దీప పతివ్రత అని తెలుసుకున్న డాక్టర్ బాబు.. కన్నుమూసిన వంటలక్క.. కార్తీకదీపంకు శుభంకార్డు?

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. అంతేకాకుండా స్టార్ మా రేటింగ్ విషయంలో అన్ని సీరియల్ కంటే కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉంది.

  • Share this:
    Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతున్నారు. అంతేకాకుండా స్టార్ మా రేటింగ్ విషయంలో అన్ని సీరియల్ కంటే కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉంది. ఇక పిల్లలిద్దరూ తన తండ్రి ఎక్కడ వదిలేస్తారు అని ఆలోచిస్తుంటే.. సౌందర్య వారిపై కోప్పడుతూ కార్తీక్ గురించి, అతని మంచితనం గురించి తెలుపుతుంది. అంతేకాకుండా దీప గొప్పతనం గురించి కూడా చెబుతుంది. ఇక పిల్లలు ఎమోషనల్ అవుతారు. ఇక ఆ తరువాత కార్తీక్, దీప ల మధ్య వున్నా కొన్ని అడ్డంకులు గురించి తలుచుకొని బాధ పడుతుంది.

    ఇక కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూ దీప గురించి ఆలోచిస్తాడు. ఇక దీప ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ, డాక్టర్ చెప్పిన మాటలు తలచుకుంటాడు. దీప తన గురించి వాదించిన మాటలు, దీప గురించి సౌందర్య చెప్పిన మాటలు తలుచుకుంటారు. ఇక దీప కవలపిల్లలు పుట్టడం, దీపని తిట్టి పోసుకోవడం, తనను కాలితో తన్నడం వంటివి తల్చుకుంటూ ఏడుస్తాడు. ఇక సౌందర్య చెప్పిన మాటలు తలుచుకుంటూ.. మమ్మీ నేను తప్పు చేశానని అనుకుంటూ.. దీప కు నరకం చూపించాను అంటూ తలుచుకుంటూ చాలా బాధ పడతాడు. ఇంత చేసినా కూడా దీప తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని, ఇంకా ఇప్పటికైనా మారుతాడని నమ్మకంతోనే ఉందని తలుచుకుంటాడు. అంతేకాకుండా దీప ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది అన్న మాటలు గుర్తు చేసుకొని.. నాకు ఈ రోజు నిజం తెలిసిందని.. నేను ఇన్ని రోజులు తప్పు చేసానని, పిల్లల దూరం పెట్టాను అంటూ, నీ మాతృత్వాన్ని అవమానించానంటూ.. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని కుమిలిపోతారు.

    వస్తున్న దీప అక్కడి నుంచి బయలుదేరుతాడు కార్తీక్.. ఇక తరువాయి భాగం లో దీప సౌందర్య దగ్గరికి వచ్చి నేను చనిపోతే డాక్టర్ బాబు మోనిత ను చేసుకుంటాడా అంటూ నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అంటూ.. తన బిడ్డలకు నరకం వద్దు అని ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. దీంతో వెంటనే సౌందర్య, పిల్లలు కంగారుపడి దీప లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వెంటనే కార్తీక్ కూడా లోపలికి రాగా.. దీప దీప అంటూ అరెస్టు దీప కు నీళ్లు తాపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ నోట్లో నీళ్ళు బయటకి రావడంతో దీప చనిపోయినట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయి భాగం లో చూడాలి. కార్తీక్ నిజం తెలుసుకున్నాక దీప ప్రాణాలు నిజం గా విడవటం మాత్రం నిజంగానే ప్రేక్షకులకు షాకింగ్ విషయమే.
    Published by:Navya Reddy
    First published: