• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DOCTOR BABU KILLED VANTALAKKA SHOCKING TWIST HAPPENED ON KARTHIKA DEEPAM SERIAL TODAY NR

Karthika Deepam: డాక్టర్ బాబునే వంటలక్కను చంపేశాడు.. కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్!

Karthika Deepam: డాక్టర్ బాబునే వంటలక్కను చంపేశాడు.. కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్!

Karthika deepam serial

Karthika Deepam: బుల్లితెరపై టీఆర్పీ ప్రభంజనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఏ రేంజ్ లో హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరపై టీఆర్పీ ప్రభంజనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఏ రేంజ్ లో హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోనే టీఆర్పీ పరంగా నెంబర్ 1 సీరియల్ గా రికార్డు కొట్టిన కార్తీకదీపంలో వంటలక్క పాత్ర పూర్తయినట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయ్. ఇందుకు కారణం.. మోనిత వంటలక్కకు ఇచ్చిన ట్యాబ్లేట్స్ ఏ. నిజానికి వంటలక్క చనిపోయేందుకు ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఒక దారుణమైన డ్రగ్ ను మోనిత ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తుంది.

    Anushka Shetty: అనుష్క బికినీపై తల్లి షాకింగ్ కామెంట్స్.. అలా ఉండొచ్చు కదా అంటూ?



    ఆ డ్రగ్ కారణంగా వంటలక్క ఆరోగ్యం దారుణంగా క్షిణించడం.. ఆమె ఆరోగ్యం కోసం సిటీకి రావడం.. సౌర్యకు కార్తీక్ బాబునే డాక్టర్ అని తెలియడం ఇలా అన్ని ఒక్కోటి రివీల్ అవుతూ వచ్చాయ్. సౌర్య, హిమ తల్లితండ్రుల గురించి తెలుసుకున్న సమయంలో వంటలక్క ఆరోగ్యం గురించి బయటపడని నిజాలు.. ఇప్పుడు వంటలక్క ఆరోగ్యం పడవడంతో పాటు చనిపోయే స్థితికి వచ్చింది. నిజానికి వంటలక్క చనిపోయే స్థితికి రావడానికి కారణం ఒకరకంగా డాక్టర్ బాబునే కారణం.

    Deepthi Sunaina - Shanmukh: దీప్తి సునయన, షణ్ముఖ్ పెళ్లి ఎప్పుడంటే?



    డాక్టర్ బాబు మోనితను నమ్మి.. వంటలక్కను అనుమానించడం మొదలు పెట్టిన రోజే వంటలక్క పతనం ప్రారంభమైంది. ఇక ఈరోజు, రేపటి ఎపిసోడ్ లో వంటలక్క చనిపోవడం.. అందుకు సౌందర్య కోపం తెచ్చుకొని డాక్టర్ బాబునే వంటలక్కను చంపేశాడు అంటూ అనడం.. కార్తీక్ కు ఇద్దరు పిల్లలు దూరం అయ్యి అతను అమెరికాకు వెళ్లిపోవడం జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మరి వంటలక్క నిజంగా చచ్చిపోతుందా? మోనితను పెళ్లి చేసుకుంటాడా లేక విదేశాలకు వెళ్ళిపోతాడు అనేది తెలియాలి అంటే మరో నెల రోజులు ఆగాల్సిందే..
    Published by:Navya Reddy
    First published: