Home /News /movies /

Karthika Deepam: నీ కడుపుకు నేను బాధ్యుడిని కాదు.. మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్?

Karthika Deepam: నీ కడుపుకు నేను బాధ్యుడిని కాదు.. మోనితకు షాక్ ఇచ్చిన కార్తీక్?

karthika deepam

karthika deepam

Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మళ్లీ ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు కూడా మళ్లీ ఏం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రేటింగ్ కూడా మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చింది.

    Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మళ్లీ ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు కూడా మళ్లీ ఏం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రేటింగ్ కూడా మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చింది. ఇక మోనిత కార్తీక్ ని కలిసి మాట్లాడగా అమ్మ లేదని తన చెల్లి దగ్గరికి అమెరికాకు వెళ్ళిందని అనడంతో వెంటనే మోనిత సాక్షి సంతకం పెట్టాల్సిన పనిలేదని వెళ్లిపోయరా అంటూ.. ఏదో కుట్ర చేస్తున్నారు.. అంటూ ఏది జరిగినా తన వైపు మళ్లేలా చూసుకుంటానని అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా కార్తీక్ మోనిత చెయ్యి పట్టుకొని తనను ఆపుతాడు.

    జరిగిన తప్పు తన జాబితాలో చేరదు అంటూ.. ఈ దోషాన్ని తన తల్లికి, తన భార్యకి అంట పెట్టకూడదని.. నేను సహించను అంటూ.. నువ్వు అన్యాయానికి, అత్యాచారానికి గురైనట్లు మాట్లాడుతున్నావ్ అంటూ నీలో ప్రేమ, బాధ కనిపించడం లేదని కేవలం దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా బెదిరింపులు చేస్తున్నావని అంటాడు కార్తీక్. ఈ మాటలకు మోనిత భయపడిపోతుంది. తనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడనుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మోనిత కార్తీక్ మాటలను ఆలోచించుకుంటూ ఏం జరుగుతుందో అని భయపడుతుంది. ఇక దీప ఎదురుగా పిల్లలు ఒకరికొకరు తమ అమ్మానాన్నలు మాట్లాడుకోవటం లేదన్నట్లుగా ఓ స్కిట్ వేశారు. ఇక దీపని కూడా ప్రశ్నించగా చాలా ఎమోషన్ అవుతుంది. మోనిత కార్తీక్ మాట్లాడిన మాటల గురించి తలుచుకుంటూ రగిలిపోతుంది.

    ఇక దీప కూడా కార్తీక్ ఆలోచనలో పడుతుంది. అంతలోనే కార్తీక్ ఇంట్లోకి ఎంతో సంతోషంగా వస్తాడు. పిల్లలతో సరదాగా ఉంటాడు. వాళ్లకి కొత్త బట్టలు తెచ్చాడు. ఇదంతా చూసి దీప షాక్ అవుతుంది. ఇక పిల్లలు బట్టలు వేసుకొని రాగానే దీప ని పిలిచి సెల్ఫీ దిగుతాడు కార్తీక్. ఇక దీప మాత్రం తనలో మార్పు చూసి షాక్ అవుతుంది. పిల్లలు బయటికి వెళ్ళాక తనలో వచ్చిన ధైర్యం గురించి, తాను తప్పు చేయలేదని నమ్మకం గురించి గట్టిగా మాట్లాడటంతో దీపా ఆశ్చర్యపోతుంది. ఇక కార్తీక్ ప్రవర్తన చూస్తే మొత్తానికి దీపకు చేరువయ్యేలా ఉన్నాడు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

    తదుపరి వార్తలు