Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. ప్రస్తుతం సరికొత్తగా సాగుతున్న ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక రేటింగ్ ఈ విషయంలో మరింత దూసుకుపోతుంది. ఈ సీరియల్ కు ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంతా కాదు.. అంతే కాకుండా యువత కూడా ఈ సీరియల్ పై బాగా ఆసక్తి చూపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సీరియల్ గురించి తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో నటించే దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారా అని ఎదురుచూడని ప్రేక్షకులే లేరు.
ఇదిలా ఉంటే ఈ సీరియల్ ఈ రోజు ఒక 1021 ఎపిసోడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. అసలేం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ దీప కు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏంటి అని భయంతో తాగి వస్తాడు. ఇక ఎదురుగా సౌందర్య తో కాసేపు మాట్లాడి అక్కడి నుండి దీప గదిలోకి వెళ్తాడు. దీప తో కాసేపు మాట్లాడి తన ముందు తడబడకుండా స్టడీ గా ఉంటాడు. ఇక మళ్లీ కొన్ని మనసుకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి.. మళ్లీ సర్దుకుంటారు. ఇక కార్తీక్ దీపను ఊరికి వెళ్ళమని చెప్పగా వెంటనే దీప ఇది నిజమేనా అంటుంది.
ఇక సంతోషాన్ని ఆపుకోలేక అందరికీ చెబుతుంది. ఇక భోజనం చేస్తున్న సమయంలో పిల్లలు కూడా కార్తీక్ ను ఊరికి వెళ్దామని అడుగుతారు. ఇక అదే సమయంలో అందంగా రెడీ అయ్యి ఉన్న మోనిత కార్తీక్ కు ఫోన్ చేసి గంటలో బయల్దేరుదాం అని అనగా.. వెంటనే కార్తీక్ నేను ఎక్కడికి రాను అంటూ ఇవాళ దీప వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి సీతారాముల కళ్యాణం వెళ్తున్నామని అనగా దీప ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఇక మోనిత ముఖంలో రంగులు మారుతాయి.
ఇక నువ్వు వస్తావని నేను రెడీ అయ్యాను అని నిరాశగా అనగా.. నువ్వు వెళ్ళద్దు.. కళ్యాణానికి నువ్వు కూడ రా అనగా ఇప్పుడు దీప ముఖంలో రంగులు మారుతాయి. మోనిత ముఖంలో సంతోషం ఉంటుంది. ఇక ఫోన్ కట్ చేశాక మీరు దానితో పాటు వచ్చే పనైతే రావడం దేనికి మేం వెళ్తాం లే అంటూ కోపంగా అంటుంది. కానీ కార్తీక్ వినకుండా మోనిత, భారతి వచ్చి తీరాల్సిందే అంటూ కఠినంగా చెబుతాడు. ఇక దీప షాక్ అవుతూ.. ఈ డాక్టర్ బాబు ఎవరికీ అర్థం కాదు అని అనుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka