Home /News /movies /

Karthika Deepam: ఈ నరకం ఇంకెంతకాలం అంటున్న డాక్టర్ బాబు.. భాగ్యంకు చుక్కలు చూపించిన మోనిత!

Karthika Deepam: ఈ నరకం ఇంకెంతకాలం అంటున్న డాక్టర్ బాబు.. భాగ్యంకు చుక్కలు చూపించిన మోనిత!

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ట్విస్ట్ లతో బాగా సాగుతుంది. ఇక మోనిత.. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రస్తుతం మరింత ఆసక్తి ఉండటంతో ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

    Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ట్విస్ట్ లతో బాగా సాగుతుంది. ఇక మోనిత.. కార్తీక్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ప్రస్తుతం మరింత ఆసక్తి ఉండటంతో ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక కార్తీక్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక భాగ్యం ప్రియమణి ఇంటికి వెళ్లగా.. ప్రియమణికి భాగ్యం తో పరిచయం లేకపోవడంతో కంగారు పడుతూ మోనిత కి ఫోన్ చేస్తుంది. అంతలోనే మోనిత రావడంతో లోపల ఉన్న భాగ్యం గురించి మాట్లాడుతుంది. భాగ్యాన్ని చూసి ఈవిడ ఎందుకు వచ్చిందాని అనుకుంటుంది.

    భాగ్యం మాత్రం తన ఇంట్లో ఉన్నట్టు హడావుడి చేస్తుంది. ఇక మోనిత.. దీప కు వ్యతిరేకం కాబట్టి తనను పలకరించడానికి వచ్చిందా అని అనుకుంటుంది. ఇక భాగ్యం వెటకారపు మాటలతో మోనిత ను అవమాన పరుస్తుంది. ఇక మోనిత తగ్గకుండా 25న రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అని భాగ్యానికి షాక్ ఇస్తుంది. ఇక దీప కార్తీక్ దగ్గరకు వచ్చి భోజనానికి పిలుస్తుంది. కార్తీక్ మీరు తినండి అంటూ మమ్మీ దగ్గరికి వెళ్లి వస్తాను అనగా దీప మాత్రం కోపంతో, వెటకారంతో మాట్లాడుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. ఇక దీప.. మోనిత గురించి ప్రశ్నించే సరికి కార్తీక్ వెంటనే ఆవేశంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

    ఇక కార్తీక్ ఇంత మదన పడుతున్నాడని అనుకోని మరి ఆ తప్పు ఎలా జరిగింది అంటూ ఆలోచిస్తుంది దీప. ఇక ప్రియమణి.. మోనిత తో కొన్ని ప్రశ్నలు వేసి తన మనసులో ఈ పెళ్లి మూన్నాళ్ళ ముచ్చట అనుకుంటుంది. ఇక సౌందర్య దగ్గరకు వెళ్ళిన కార్తీక్ ను ప్రశ్నిస్తుంది. పైగా 25న పెళ్లి అట అని షాకిస్తుంది సౌందర్య. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు. మోనిత తనను ఎలా తీసుకొని వెళ్ళిందో వివరిస్తాడు. ఇక సౌందర్య మాత్రం దీపను, పిల్లలను ఎలా దూరం చేసుకుంటావు అన్నట్లు మాట్లాడుతుంది. ఇక ఆ మాటలతో కార్తీక్ మరింత బాధపడతాడు. మొత్తానికి పిల్లలకు, దీప కు న్యాయం చేయమని సలహా ఇస్తుంది. దీంతో కార్తీక్ సౌందర్య మాటలను విని మోనిత తో పెళ్లిని నిరాకరిస్తాడో లేదో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు