Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం బాగా ఆసక్తిగా మారింది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో బాగా దూసుకుపోతుంది. ఇక రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. కార్తీక్ రోషిణి దగ్గరికి వెళ్లి మోనిత బ్రతికే ఉందని ఎంత చెప్పినా రోషిణి నమ్మక పోవడంతో కార్తీక్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మోనిత రత్న సీతకు మరో ప్లాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రాత్రికే ప్లాన్ చేయాలి అంటూ రత్న సీతకు తెలిపింది. మరోవైపు సౌర్య కు జ్వరం రావడంతో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇక సౌర్య దీప గురించి కోపంగా మాట్లాడటంతో సౌందర్య దీప గురించి, తను పడిన కష్టాల గురించి వివరిస్తుంది. మరోవైపు మోనిత దేవుడికి దండం పెడుతూ కార్తీక్ గురించి తలుచుకుంటుంది. కార్తీక్ ను తనకి దక్కేలా చెయ్యి అంటూ వేడుకుంటుంది. ఇక తను డాక్టర్ గా చేస్తున్నది తప్పే అనుకుంటూ కానీ ఓ ప్రేమికురాలిగా చేస్తున్నాను అంటూ దేవుడి ముందు ఎమోషనల్ అవుతుంది.
ఇక కార్తీక్ ఫోటోను చూస్తూ క్షమించమంటూ తనను దక్కించుకోవడం కోసం హింసించడం తప్పనిసరి అనుకుంటుంది. అంతలోనే కార్తీక్ కు కడుపు నొప్పి మొదలవుతుంది. కార్తీక్ బాధను చూసి మోనిత టీ లో వద్దన్న ఏదో కలిపిందని అనుకుంటుంది. కార్తీక్ మాత్రం కడుపు నొప్పితో బాధపడగా రత్న సీత వచ్చి పలకరిస్తుంది. అక్కడున్న కానిస్టేబుల్ ను పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుంది.
ఇది కూడా చదవండి:డాక్టర్ బాబుకు కడుపునొప్పి.. మోనితతో రత్నసీత కుట్ర.. కిడ్నాప్‌కు పక్కా స్కెచ్!
సౌర్య దగ్గరికి దీప వచ్చి టాబ్లెట్ వేసుకోమంటుంది. ఇక సౌర్య టాబ్లెట్ వేసుకోకుండా తన తల్లిని తన మాటలతో బాధపెడుతుంది. మోనిత దీప మాట్లాడిన మాటలను తలుచుకుంటూ.. కార్తీక్ ను దక్కించుకోవడం కోసం కష్టపెడుతున్నానంటూ అనుకుంటుంది. దీప కూడా ఎక్కడికో బయలుదేరినట్లు కనిపించగా సౌర్య మాటలను.. తను పడుతున్న కష్టాలను తలుచుకొని ఏడుస్తుంది. అంతలోనే కార్తీక్ కు వచ్చిన కడుపు నొప్పి గురించి తెలియడంతో బాగా ఎమోషనల్ అవుతుంది.
ఇక హాస్పిటల్లో మోనిత డాక్టర్ గా కొత్త లుక్ లో ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ దగ్గరికి వెళ్లి ఇంజక్షన్ ఇస్తుంది. కార్తీక్ కు ట్రీట్మెంట్ చేస్తుంది. దీప హాస్పిటల్ కు రావడంతో.. రత్న సీతను ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక దీప లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తే రత్న సీత కోపమవుతుంది. ఇక మోనిత కార్తీక్ ను పిలుస్తూ కార్తీక్ ని లేవకుండా చేతులు కడుతుంది.ఇలా ఎందుకు చేశారని అడగటంతో మోనిత తన లుక్ ను చూపిస్తుంది. వెంటనే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక కార్తీక్ దగ్గరికి వెళ్లి కార్తీక్ పక్కనే కూర్చుంటుంది మోనిత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Nirupam paritala, Premi vishwanth, Rathna Seetha, Vantalakka