DOCTOR BABU EMOTIONAL ON MOUNITHA BLACKMAIL WITH SOUNDARYA IN KARTHIKA DEEPAM SERIAL NR
Karthika Deepam: మోనిత రాక్షసి మమ్మి.. దీన స్థితిలో డాక్టర్ బాబు!
Karthika Deepam
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎటు అర్థంకాని పరిస్థితిలో ఉంది. దీంతో ప్రేక్షకులు ఈ సీరియల్ పై మండిపడుతున్నారు. వెంటనే శుభం కార్డు పలికించండి అంటూ ఈ ట్విస్టులు చూడటం మా వల్ల కాదు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎటు అర్థంకాని పరిస్థితిలో ఉంది. దీంతో ప్రేక్షకులు ఈ సీరియల్ పై మండిపడుతున్నారు. వెంటనే శుభం కార్డు పలికించండి అంటూ ఈ ట్విస్టులు చూడటం మా వల్ల కాదు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మోనిత రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి కార్తీక్ ని తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఇంత త్వరగా పెళ్లి చేయడం కుదరదని చెప్పడంతో మొత్తానికి తన ఎమోషనల్ డైలాగ్స్ తో పెళ్లి 25వ తేదీన కావడానికి ఒప్పించుకుంటుంది. ఇక ఆఫీసర్ పెళ్లి చేసుకోవడానికి కొన్ని పద్ధతులున్నాయని ఏర్పాట్లు చేసుకోమని అంటాడు. పైగా ఇద్దరు సాక్షులు ఉండాలని తెలపడంతో వెంటనే మోనిత కార్తీక్ తల్లి సౌందర్య, ఆయన మొదటి భార్య దీప ఉన్నారని తెలుపుతుంది.
ఇక కార్తీక్ తన ఆలోచనలో మునిగిపోతాడు. వెంటనే మోనిత గమనించి ప్రశ్నించగా.. ఎంత దూరం తీసుకెళ్తావా అని ఆలోచిస్తున్నాను అంటాడు. ఇక మోజు కోసమో, సహజీవనం చేసో ఈ పరిస్థితి రానివ్వలేదని ఇన్ని రోజులు మౌనం గా ఉన్నానంటే నీ తప్పు ఎలా జరిగిందని ఆలోచిస్తున్నాననంటూ.. పైగా ఈ తప్పు నా వల్ల జరగలేదని ఈ తప్పు కారణం ఇద్దరం అంటూ కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. మోనిత పై తన మాటలతో తెగ విరుచుకుపడతాడు. ఆ తప్పు జరిగినప్పుడు స్పృహలో లేను అంటూ, నువ్వు స్పృహలో ఉన్నావు, నన్ను స్పృహలోకి రప్పించాలని ధ్యాస లేదు. ఆ మరుసటి రోజే ఈ విషయం చెప్పలేదంటూ.. కార్తీక్ అంటాడు. ఈ సమస్య సర్పం గా మారి మెడకు చుట్టుకుందో అప్పుడు నీ మెడలో నుంచి తీసేసి నా మెడకు చుట్టేసి నీ చేతులు దులిపేసుకున్నావు.. నా కాపురాన్ని కాటేసావ్ అంటూ మోనిత పై రగిలిపోతాడు కార్తీక్.
అంతేకాకుండా ఇక్కడవరికీ నా భార్య, మా అమ్మ ఎలా వస్తారని చెబుతున్నావ్ అని గట్టిగా ప్రశ్నిస్తాడు. కానీ మోనిత కూడా అంతే గట్టిగా తన మాటలతో రగిలిపోతుంది. ఇక కార్తీక దీప గురించి తను పడిన బాధ గురించి వివరిస్తాడు. దీప సహనానికి గుడి కట్టాలి కానీ నీవు సమాధి కట్టమని చెబుతున్నావు అంటూ మండిపోతాడు. కానీ మోనిత మాత్రం అవన్నీ పట్టించుకోకుండా సాక్షులుగా నీ తల్లి, భార్యను తీసుకురావాల్సిన బాధ్యత నీదే అంటూ చెప్పేస్తుంది. ఇక కార్తీక్ ఏమనలేక అక్కడినుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.