Karthika Deepam: ఆ రాత్రి ఏమైందో చెప్పు ప్రియమణిని అంటూ కదిలించిన కార్తీక్.. అసలు నిజం త్వరలోనే బయటకు?

Karthika Deepam

Karthika Deepam: కార్తీకదీపం ప్రస్తుతం మళ్లీ ఆసక్తిగా మారింది. ఇక దీప కూడా కార్తీక్ మనసును అర్థం చేసుకొని కార్తీక్ కోసం ఆరాటపడుతుంది. దీంతో ప్రేక్షకులు కూడా శుభం కార్డు పలుకుతుందన్న ఆనందంలో మళ్లీ ఈ సీరియల్ ను మిస్ చేసుకోవడం లేదు. ఇక కార్తీక్ ప్రియమణి దగ్గరికి వెళ్లి ఆ రోజు రాత్రి ఏం జరిగిందని భయపడకుండా చెప్పు అని బ్రతిమాలుతాడు.

  • Share this:
    Karthika Deepam: కార్తీకదీపం ప్రస్తుతం మళ్లీ ఆసక్తిగా మారింది. ఇక దీప కూడా కార్తీక్ మనసును అర్థం చేసుకొని కార్తీక్ కోసం ఆరాటపడుతుంది. దీంతో ప్రేక్షకులు కూడా శుభం కార్డు పలుకుతుందన్న ఆనందంలో మళ్లీ ఈ సీరియల్ ను మిస్ చేసుకోవడం లేదు. ఇక కార్తీక్ ప్రియమణి దగ్గరికి వెళ్లి ఆ రోజు రాత్రి ఏం జరిగిందని భయపడకుండా చెప్పు అని బ్రతిమాలుతాడు. ప్రియమణి కార్తీక్ అడిగిన ప్రశ్నలకు భయంతో వణికిపోతుంది. తన జీవితంలో కలతలు దూరం అయ్యాయని సంతోషపడే సమయం లో మౌనిత ఈ వార్త తీసుకువచ్చిందని ఆ రోజు ప్రియమణి అక్కడే ఉండటంతో ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. ప్రియమణి గతాన్ని గుర్తు చేసుకొని మోనిత కి తెలిస్తే చంపేస్తుందనే భయంతో తన మీద ఒట్టేసి కొని తనకేం తెలియదని నిజం దాచేసి తప్పుకుంటుంది.

    ఇక దీప ఆదిత్య తో కలిసి కార్తీక్ కు న్యాయం చేయడానికి లాయర్ ఇంటికి వెళుతుంది. ఇక అది చూసిన మోనిత కార్తీక్ కు దీప సపోర్ట్ చేస్తుందనుకొని భయపడుతూ కార్తీక్ అన్న మాటలను గుర్తు చేసుకొని వణికిపోతుంది. కార్తీక్ భాగ్యం ఇంటికి వెళ్లి తాను గతంలో వారితో ఉన్న విధానాన్ని గుర్తు చేసుకొని క్షమాపణలు తెలుపుతాడు. ఇక భాగ్యం గౌరవంగా మాట్లాడుతూ తమ కాపురాన్ని కాపాడుతాను అంటూ ధైర్యం ఇస్తుంది. ఇక పిల్లలు కొత్త బట్టలతో ఫ్యాషన్ షో చేయగా వాళ్లను చూసి నవ్వుకుంటుంది. ఇక అంతలోనే కార్తీక్ కూడా రావడంతో అదంతా గమనిస్తాడు. ఇక పిల్లలు సిగ్గుపడగా మళ్లీ దీపతో కలిసి నవ్వుతారు.కార్తీక్ తమ నవ్వులను చూసి మరింత మురిసిపోతాడు.

    ఇక పిల్లలను ఇలాగే సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్లు మళ్లీ స్నానం చేసి బట్టలు మార్చుకోమని పంపిస్తుంది. ఇక కార్తీక్ దీప వైపు చూస్తూ రొమాంటిక్ గా అడుగులు వేస్తాడు. పైగా బ్యాక్ గ్రౌండ్ లో 'మధురం మధురం' సాంగ్ కూడా వేయడంతో కార్తీక్ దీప దగ్గరికి వెళ్లేసరికి పిల్లలు వెంటనే అమ్మ నా బట్టలు ఎక్కడున్నాయని గట్టిగా అరవడంతో వెంటనే కార్తీక్ కు డిస్టర్బ్ అవ్వగా దీప కార్తీక్ నే చూస్తూ వస్తున్నా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
    Published by:Navya Reddy
    First published: