Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. వంటలక్క కష్టాలు ఇక తీరవా.. మోనితను చంపినా కేసులో డాక్టర్ బాబు అరెస్ట్!

Karthika Deepam

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో బాగా సాగుతున్నా ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో బాగా సాగుతున్నా ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు. అంజి దగ్గరికి వెళ్లిన కార్తీక్ ఇంటికి రావడంతో దీప అంజి గురించి అక్కడ జరిగిన విషయాల గురించి ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ అంజి వల్ల ఉపయోగం లేదు అన్నట్లు.. పైగా సాక్ష్యం కూడా ఏమీ లేదని అనడంతో వెంటనే దీప.. మోనిత అంజిని బెదిరించిన వీడియోను కార్తీక్ కు చూపిస్తుంది. ఇక వీడియోను చూసిన కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. ఇప్పుడు రోషిణి ఈ సాక్ష్యం చూపిస్తే నమ్ముతుందా! అని ఇన్నాళ్లు అంజి గురించి ఇందుకే ఎదురుచూశానని దీప అంటుంది.

    ఇప్పుడు మళ్లీ మనం కలిసే సరికి మరో నాటకం చేస్తుంది అని.. మోనిత గురించి మీరు టెన్షన్ పడకండని ధైర్యం ఇస్తుంది. ఇక ఆ సమయంలో కార్తీక్ కనిపించకపోయేసరికి దీప వెంటనే కార్తీక్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. ఇక కార్తీక్ డాక్టర్ భారతి ఫ్రెండ్ చనిపోయారట చూడడానికి వెళుతున్న అని కట్ చేసాడు. దాంతో నేను వెళ్తున్నది చనిపోయిన వారిని చూడటానికి కాదు దీప.. మోనితను చంపడానికి వెళ్తున్న అనుకుంటాడు. దీప మాత్రం కార్తీక్ మాటలు అస్సలు నమ్మదు. అంతలో ఆదిత్య ఫోన్ చేసి అన్నయ్య కంగారుగా వచ్చాడని మాట్లాడుతాడు. దాంతో దీప టెన్షన్ పడుతూ కార్తీక్ కు మళ్లీ ఫోన్ చేస్తుంది. ఈ సారి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు.ఇక భాగ్యం గురించి ఆమె భర్త బాధపడుతుంటాడు. మరోవైపు భాగ్యం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక మోనిత అంజి తప్పించుకున్న విషయాన్ని తలచుకుంటూ రగిలిపోతుంది.

    Karthika Deepam
    Karthika Deepam


    రోషిణిని కలిసి నిజం చెబుతాడా అని ఆలోచిస్తుంది. వెంటనే ఆవేశంతో కార్తీక్ లోపలికి వస్తాడు. ఇక కార్తీక్ ని చూసి తెగ పొంగిపోతుంది మోనిత. ఇక కార్తీక్ నోరు ముయ్యవే అని కోపం చూపిస్తాడు. మోనిత తనను పెళ్ళాన్ని పిలిచినట్లు అప్పుడే పిలుస్తున్నాడు అని అనడంతో ఎవరే పెళ్ళాం.. నా పెళ్ళాం పేరు దీప.. చచ్చేదాకా తనే నా పెళ్ళాం.. నీలాంటి మోస గత్తెలు 100 మంది వచ్చినా కాలి గోటితో సమానం అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతాడు. దాంతో మోనిత ఆ మాటలకు షాక్ అవుతూ కార్తీక్ పై అరుస్తుంది. కార్తీక్ అంతటితో ఆగకుండా నిన్ను చంపేస్తా అంటాడు. తర్వాత ఎపిసోడ్ లో రోషిణి కార్తీక్ దగ్గరికి వచ్చి మోనిత శవం ఎక్కడ దాచావని అనడంతో.. దీప ప్రశ్నిస్తుంది. నీ భర్త మోనితను షూట్ చేసి చంపాడని చెబుతుంది. దాంతో దీప షాక్ అవ్వగా కార్తీక్ ను అరెస్టు చేసి తీసుకు వెళుతుంది రోషిణి. దీంతో పిల్లలతో సహా అందరూ ఏడుస్తూ ఉంటారు.
    Published by:Navya Reddy
    First published: