Karthika Deepam: వంటలక్క ఫ్యాన్స్ ఎదురుచూసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టిన డాక్టర్ బాబును ఓదార్చిన వంటలక్క?

Karthika deepam

Karthika Deepam:  బుల్లితెరలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు.

  • Share this:
    Karthika Deepam:  బుల్లితెరలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు అలవాటు పడ్డారు. ప్రస్తుతం కథ మొత్తం ట్విస్టులతో బాగా సాగుతుంది. ఇదిలా ఉంటే ఆనందరావుకి గుండెనొప్పి రావడంతో కార్తీక్ హాస్పిటల్లో చేరుస్తాడు. ఆనందరావు కార్తీక్ ను చీదరించుకుని అక్కడినుంచి వెళ్ళిపో అంటాడు. కార్తీక్ తన తండ్రి అన్న మాటలు తలుచుకొని తెగ బాధపడుతుంటాడు. దీప, కార్తీక్, ఆదిత్య.. ఆనంద్ రావు గది బయట ఎదురుచూస్తుంటారు.

    లోపలికి వెళ్ళిన భాగ్యం బయటికి వచ్చి అన్నయ్య బాగానే ఉన్నారని చెబుతుంది. ఇక డాక్టర్ వచ్చి అంకుల్ కోపంగా ఉన్నారని అంటాడు. ఇక వెంటనే తనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని అనడంతో కార్తీక్.. ఆదిత్యతో ఫార్మాలిటీస్ చూసుకోమని చెబుతాడు. ఇక కార్తీక్ అలాగే ఆలోచిస్తూ ఉండగా దీప వచ్చి తన మాటలతో నచ్చ చెబుతుంది. బాధ పడొద్దు అని ఓదారుస్తుంది. కానీ కార్తీక్ అన్ని తలుచుకుంటూ కుమిలిపోతుంటాడు. దీప న్యాయం మీ వైపే ఉంది అంటూ..నేను మీ వైపే ఉన్నాను అంటూ భరోసా ఇస్తుంది. దీప మాటలకు కార్తీక్ ఆమె భుజం పై తల పెట్టుకొని.. ఇంకా దగ్గరికి తీసుకో దీప అంటూ ఎమోషనల్ అవుతాడు

    దీప అక్కడినుంచి బయటికి వెళదామని కార్తీక్ ను తీసుకెళ్తుండగా అంతలో మోనిత వచ్చి అడ్డు పడుతుంది. అరగంట పని ఉంది రా కార్తీక్ అంటూ చెయ్యి పట్టుకుంటుంది. ఇక కార్తీక్ ఇక్కడికి ఎందుకు వచ్చావు.. చేసేది అంతా చేశావంటూ మండిపడుతాడు. కానీ మోనిత అవన్నీ పట్టించుకోకుండా దీప నీ బిడ్డలను మోసింది. నేను నీ బిడ్డను మోస్తున్నాను. ఇద్దరిలో తేడా ఏముంది. తాళి ఒక్కటే కదా. పెళ్లి తర్వాత అందరం ఒక్కటవుతాం కదా అనేసరికి వెంటనే కార్తీక్ మోనితపై విరుచుకుపడతాడు. ఏ మొహం పెట్టుకొని వచ్చావే అని రగిలిపోతుంది దీప. మామయ్య గారి ప్రాణాలు రిస్క్ లో పెట్టావా అనేసరికి రేపు పెళ్ళి అయితే నాకు మావయ్యే అవుతారు కదా అని తన మాటలతో రెచ్చగొడుతుంది.

    Karthika deepam
    Karthika deepam


    ఇక కార్తీక్ ని వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే దీప వెళ్లండి డాక్టర్ బాబు పెళ్లి పనులు చేసుకోవాలి ఏమో.. అందుకే పిలుస్తుంది ఏమో.. ఈ లోపు పెళ్లి పెటాకులు చేసే పనిలో నేను ఉంటాను అంటుంది. అయినా ఈ టైంలో అంజి ఉంటే బాగుంటుంది.. అనేసరికి మోనిత షాక్ అవుతుంది. దీప లో ఇంత ధైర్యం ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇక పైకి మాట మారుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక దీప ఇంట్లో అందరూ ఉన్న సమయంలో మోనిత రావడంతో భాగ్యం మోనితను కొట్టబోతుంది. వెంటనే ఇలాంటిది ఉంటుందని విషం కలిపిన నీళ్లు తెచ్చుకున్నాను అంటూ.. ఏమైనా చేస్తే ఇవి తాగేస్తాను అని బెదిరిస్తుంది. ఇక అందరు షాక్ అవ్వగా దీప మాత్రం తాగనివ్వండి అంటూ ప్రాణాలే కదా పోతాయి అంటూ బాటిల్ ను మోనిత వైపు జరుగుతుంది. ఇక మోనిత బాటిల్ ని ముట్టుకోదు అనేసరికి నేను తాగానా అని దీప ఆ నీళ్లను తాగుతుంది. ఇక మరి దీప పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: