karthika deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ ఎంతగా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంది కార్తీకదీపం. అంతేకాకుండా ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు సీరియల్ సమయానికంటే ముందు టీవీల ముందు వాలిపోతున్నారు.
దీప అనారోగ్యం కారణంగా బాధపడుతుండగా కార్తీక్ తన ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు. కానీ దీప మరేదో విషయం దాచుతున్నాడని.. ఆ విషయం బయట పడటానికి తన ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. శ్రీ రామ్ నగర్ లో ఉన్న తన పాత ఇంటికి వెళ్లి అక్కడ తన పనులు మొదలుపెడుతుంది. ఇదంతా కార్తీక్ నచ్చకపోవడంతో ఇంటికి రమ్మని కోరగా వినకుండా అలాగే ఉంటుంది దీప. దీంతో పిల్లల్ని, మాలతీని దీప దగ్గరికి రప్పిస్తాడు. ఇక దీప ఇంట్లో కార్తీక్ తన పిల్లలతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో.. పిల్లలు కూడా కార్తీక్ ని ఇక్కడే ఉండమని కోరుతారు. దీంతో కార్తీక్ వినిపించకుండా అప్పుడప్పుడు వస్తా అని అనడంతో.. పైగా మాలతీ మీకు వంట చేసి పెడుతుంది అని అనడంతో దీప నేను చేసుకుంటాను అని మొండిపట్టు పడుతోంది. కార్తీక్ కూడా దీప పై బాగా అరుస్తాడు. కానీ దీప కూడా మళ్లీ మళ్లీ అదే మొండితనంతో మాట్లాడుతుంది. ఇక అక్కడ్నుంచి కార్తీక్ బయలుదేరుతాడు.
ఇక మోనిత తన ఇంట్లో కార్తీక్ గురించి మనశ్శాంతిగా బతుకునిచ్చేలా లేడు అంటూ రగిలిపోతుంది. ఇక ఆదిత్య, శ్రావ్య.. దీప, కార్తీక్ ల కాపురం గురించి బాధ పడతారు. ఇక మురళి కృష్ణ ఇంటికి వెళ్లి భాగ్యంతో జరిగిన విషయాన్ని తెలుపుతాడు. ఇక దీప ఇంట్లో ఉండగా.. పిల్లలిద్దరూ సరోజినీ ఇంటికి టీవీ చూడటానికి వెళతారు. ఆ సమయంలో వారణాసి దీప అడగడంతో కుట్టుమిషన్ తీసుకొని వస్తాడు. ఇది కార్తీక్ కంట పడగా.. వెంటనే మళ్లీ వెనుకకు వస్తాడు. దీంతో ఇది ఎవరికీ అని గట్టిగా అడగడంతో.. నేను తెప్పించుకున్నానని దీప అనడంతో వెంటనే కోపంతో రగిలిపోతాడు. ఇది సమాజం బతుకుతెరువు కోసం అనే మాటలు మాట్లాడుతుంది. వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళమని వారణాసి తో చెబుతాడు కార్తీక్. వెంటనే అక్కడి నుంచి వారణాసి దానిని తీసుకుని వెళ్లగా.. దీప బాధతో కుమిలిపోతుంది. పొట్ట నింపుకొని ఆధారం లేకుండా చేశావని కార్తీక్ పై అరుస్తుంది. ఇక అక్కడి నుంచి కార్తీక్ కోపంగా వెళ్తుండగా దీప వెళ్లి కార్తీక్ ముందు వెళ్లకూడదని అడ్డుపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Deepa, Kathika deepam serial, Monitha, Premi Vishwanath, Shoba shetty, Soundarya, Vantalakka