Home /News /movies /

DOCHEVAAREVARURA MOVIE TEASER RELEASED BY RAJAMOULI SB

Dochevaarevarura: దోచేవారెవరురా టీజర్ విడుదల చేసిన రాజమౌళి..!

రాజమౌళి

రాజమౌళి

ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు ప్రణవ చంద్ర, మాళవిక జంటగా కనిపించబోతున్నారు. బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులు ఉన్నారు.

    'దోచేవారెవరురా' టీజర్‌‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా "దోచేవారెవరురా" సినిమా టీజర్ విడుదల చేశారు.

    దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న "దోచేవారెవరురా" కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు యూనిట్.

    ఇక వివరాల్లోకి వెళితే "మనీ", "సిసింద్రీ" , "పట్టుకోండి చూద్దాం" వంటి చిత్రాలతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించి విలక్షణ దర్శకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు శివనాగేశ్వరరావు. అయన దర్శకత్వం వహిస్తూ, ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు ప్రణవ చంద్ర, మాళవిక జంటగా కనిపించబోతున్నారు. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఔట్ & ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ "దోచేవారెవరురా" తెరకెక్కింది.

    బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను గోవా షెడ్యూల్ లో చిత్రీకరించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే తమ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతామంటున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rajamouli, Tollywood

    తదుపరి వార్తలు