Home /News /movies /

DO YOU REMEMBER AAMIR KHAN TAARE ZAMEEN PAR CHILD ARTIST DARSHEEL SAFARY AND HOW HE LOOKS NOW PK

Taare Zameen Par child artist: అమీర్ ఖాన్ ‘తారే జమీన్ పర్’ సినిమాలోని బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

తారే జమీన్ పర్ బాలనటుడు దర్శీల్ సఫారీ (aamir khan Taare Zameen Par)

తారే జమీన్ పర్ బాలనటుడు దర్శీల్ సఫారీ (aamir khan Taare Zameen Par)

Taare Zameen Par child artist: అమీర్ ఖాన్ (Aamir Khan) కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి. కానీ మనసును తాకే సినిమా.. ప్రేక్షకుల్లో మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే సినిమా మాత్రం తారే జమీన్ పర్ (Taare Zameen Par child artist). ఆ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే. మానసిక రుగ్మతతో మెదడు అంతగా ఎదగని ఓ బాలుడి కథే ఈ చిత్రం.

ఇంకా చదవండి ...
అమీర్ ఖాన్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి. కానీ మనసును తాకే సినిమా.. ప్రేక్షకుల్లో మనసుల్లో ఎప్పటికీ ఉండిపోయే సినిమా మాత్రం తారే జమీన్ పర్. ఆ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే. మానసిక రుగ్మతతో మెదడు అంతగా ఎదగని ఓ బాలుడి కథే ఈ చిత్రం. ఎంతో అందమైన కథను మనసుకు హత్తుకునేలా ఎంతో హృద్యంగా తెరపై ఆవిష్కరించాడు అమీర్ ఖాన్. తనలో మంచి నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన దర్శకుడు కూడా ఉన్నాడని తారే జమీన్ పర్ సినిమాతో నిరూపించాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఇషాన్ అవస్తీ అనే బుడ్డోడు కూడా పరిచయమే. 8 ఏళ్ళ కుర్రాడు చుట్టుపక్కల పిల్లల కంటే కాస్త తక్కువ యాక్టివ్ నెస్‌తో కనిపిస్తుంటాడు. తన సమస్య ఏంటో తనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. ఆ పాత్రకు ప్రాణం పోసాడు దర్శీల్ సఫారి. తారే జమీన్ పర్ సినిమా వచ్చినపుడు ఈ పిల్లాడి వయసు 8 ఏళ్ళు.

ఆ సినిమా సంచలన విజయం సాధించినా కూడా ఎందుకో మరి కెరీర్ పరంగా ఎక్కువ సినిమాలు చేయలేదు దర్శీల్. చదువుపై ఫోకస్ చేసి సినిమాలకు దూరంగానే ఉన్నాడు. పైగా అంత పెద్ద విజయం తర్వాత లో ప్రొఫైల్ మెయింటేన్ చేసాడు. దర్శీల్ ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడనే విషయంపై కూడా పెద్దగా వార్తలు రాలేదు.



తారే జమీన్ పర్ తర్వాత ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసిన ఈ బాలనటుడు.. బాలీవుడ్‌కే కాదు సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత దర్శీల్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ పిల్లాడు పెరిగి పెద్దోడయ్యాడు.. పిల్లాడి నుంచి 23 ఏళ్ళ కుర్రాడు అయ్యాడు.

Anasuya Bharadwaj: ‘పుష్ప’లో అనసూయ ‘దాక్షయణి’ లుక్ వైరల్.. ఈమె కెరీర్‌లో భిన్నమైన పాత్రలు ఇవే..


Pushpa - Sukumar: ‘పుష్ప’ కోసం అందర్నీ మార్చేస్తున్న సుకుమార్.. మార్పు మంచికేనా మాస్టారు..?


దర్శీల్‌ను ఇప్పుడు చూస్తుంటే.. తారే జమీన్ పర్‌లో చూసింది ఈ పిల్లాడినేనా అనే అనుమానం వచ్చేలా మేకోవర్ అయ్యాడు. ఈయన కొత్త ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తారే జమీన్ పర్ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని.. అప్పట్నుంచి తనకు తెలియకుండానే ఓ సెలబ్రిటీ అయిపోయాను అంటున్నాడు దర్శీల్. చిన్నప్పటి నుంచి కూడా ప్రతీ ఒక్కరు ఆ సినిమా గురించి మాట్లాడటం.. స్కూల్‌లో అయితే తనతో ఫోటోలు కూడా దిగేవారని గుర్తు చేసుకున్నాడు. అయితే తన చుట్టూ పరిస్థితులు మారినా కూడా తాను మాత్రం ఎప్పట్లాగే ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. సినిమా చేసినా కూడా తనకు అలాంటి ఫీలింగ్ ఏం లేదని.. తన తల్లిదండ్రులు కూడా డౌన్ టూ ఎర్త్ అన్నట్లుగానే పెంచారని తెలిపాడు. తారే జమీన్ పర్ తర్వాత భం భం భోలే, జొక్కొమోన్ లాంటి సినిమాల్లో నటించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Aamir Khan, Bollywood, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు