ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నపాప ఇప్పుడు సూపర్ స్టార్.. సీనియర్ హీరోయిన్ హోదా కూడా అందుకుంది. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో కలిపి దాదాపు 200..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 2, 2020, 10:21 PM IST
ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్ (Tollywood actress)
  • Share this:
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నపాప ఇప్పుడు సూపర్ స్టార్.. సీనియర్ హీరోయిన్ హోదా కూడా అందుకుంది. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో కలిపి దాదాపు 200 సినిమాల వరకు నటించింది. 80ల్లోనే వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత వందల సినిమాల్లో నటించింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. మరోవైపు రాజకీయాలు కూడా చేస్తుంది ఈమె. రెండు రంగాల్లోనూ సత్తా చూపించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఇంత కూడా పోల్చుకోలేకపోతున్నారు కదా.. ఆమె మరెవరో కాదు ఖుష్బూ సుందర్.

ఖుష్బూ సుందర్ ట్విట్టర్ ఫోటో (khusboo sundar)
ఖుష్బూ సుందర్ ట్విట్టర్ ఫోటో (khusboo sundar)


వెంకటేష్ హీరోగా పరిచయమైన కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఈమె. ఆ తర్వాత తమిళంలో ఈమె సూపర్ స్టార్ అయిపోయింది. తొలిసారి ఓ హీరోయిన్‌కు గుడి కట్టేంత అభిమానం సంపాదించుకుంది ఖుష్బూ. బొద్దు అందాలతో దశాబ్ధంన్నర పాటు తమిళ ప్రేక్షకులను అలరించింది ఖుష్బూ.

వెంకటేష్ రేర్ ఫోటోస్ (venkatesh rare photos)
వెంకటేష్ రేర్ ఫోటోస్ (venkatesh rare photos)


ఈమెకు అప్పట్లో గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించింది ఈమె. ఇప్పటికీ స్పెషల్ రోల్స్ చేస్తుంది ఖుష్బూ. రెండేళ్ల కింద పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో తల్లి పాత్రలో నటించింది.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading