ప్రభాస్ ఏంటి.. విశ్వామిత్రుడిగా నటించడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నటించాడు.. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో.. అదెప్పుడు జరిగిందబ్బా అనుకుంటున్నారా..? సరిగ్గా 13 ఏళ్ల కింద జరిగింది ఈ వింత. అప్పట్లో చత్రపతి సినిమా చేసిన తర్వాత ప్రభాస్తో రాజమౌళికి మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన రవితేజతో విక్రమార్కుడు చేసి డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ఆ క్రమంలోనే సింహాద్రి తర్వాత హిట్స్ లేక అల్లాడిపోతున్న జూనియర్ ఎన్టీఆర్తో సెవెన్త్ వండర్ కింద యమదొంగ సినిమా చేసాడు రాజమౌళి.

విశ్వామిత్రుడిగా ప్రభాస్ (prabhas as vishwamitra)
ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఉన్నాడు. ఎప్పుడబ్బా అనుకుంటున్నారు కదా.. ఉన్నాడు కాస్త జాగ్రత్తగా చూస్తే కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని రాజమౌళికి సన్నిహితులు, కావాల్సిన వాళ్లైన చెర్రీ, ఊర్మిల గుణ్ణం విశ్వామిత్ర క్రియేషన్స్పై నిర్మించారు.. సినిమా మొదట్లో ఈ బ్యానర్ పేరు పడే సమయంలో విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు.

విశ్వామిత్రుడిగా ప్రభాస్ (prabhas as vishwamitra)
ఆ తర్వాత ఆయన ఆకాశం వైపు కమండలాన్ని చూపించగానే విశ్వామిత్ర క్రియేషన్స్ అని వస్తుంది. అక్కడ విశ్వామిత్రుడు ఎవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే సరిగ్గా చూడకపోతే అది కనిపించదు. అసలు ఆ సినిమాలో ప్రభాస్ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కేవలం రాజమౌళి కోసమే ఈ గెటప్ వేసాడు యంగ్ రెబల్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published:May 13, 2020, 19:25 IST