Rajamouli - MM Keeravani: ఆ విష‌యంలో కీర‌వాణిని చూసి న‌వ్వుకుంటున్న రాజ‌మౌళి..!

Do you konw Rajamouli and other family members laughs at Keeravani regards in that matter

Rajamouli - MM Keeravani: కీర‌వాణి ప‌డుతున్న ఇబ్బందిని చూసుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులు న‌వ్వుకుంటున్నార‌ట‌. ఇంతకీ ఆయన పడుతున్న ఇబ్బంది ఏంటో తెలుసా..

  • Share this:
    ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి డైరెక్ట‌ర్‌గా రాణించే ముందు ఆయ‌న‌కు స‌ల‌హాలు సూచ‌న‌లు అందించిన వారిలో తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో పాటు అన్న‌య్య కీర‌వాణి కూడా ఉన్నాడు. డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మంలో రాజ‌మౌళి సినిమాల స‌క్సెస్‌లో మ్యూజిక్ ప‌రంగా కీర‌వాణి ఎలాంటి సంగీతాన్ని అందించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్పుడు కీర‌వాణి కుటుంబం నుంచి రాజ‌మౌళి త‌ర్వాత సినీ రంగంలోకి అడుగులు వేసిన వారిలో కీర‌వాణి ఇద్ద‌రు కొడుకులు కాల‌భైర‌వ‌, శ్రీసింహ‌. ఇందులో కాల భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా, సింగ‌ర్‌గా బిజీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక శ్రీసింహ హీరోగా నిరూపించుకునే ప్ర‌య‌త్నాల‌ను గ‌ట్టిగా చేస్తున్నాడు.

    మ‌త్తు వ‌ద‌ల‌రా త‌ర్వాత శ్రీసింహ హీరోగా న‌టించిన చిత్రం తెల్ల‌వారితే గురువారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ‌మౌళి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ప్రేక్ష‌కుల‌కు షేర్ చేశాడు. ఇంత‌కీ రాజ‌మౌళి ఏం చెప్పాడో తెలుసా?.. శ్రీసింహ హీరో అయ్యాడు కాబ‌ట్టి , చాలా మంది రాజ‌మౌళికి ఫోన్ చేసి..శ్రీసింహ కోసం క‌థ‌ను త‌యారు చేశామ‌ని, విన‌మని అడుగుతున్నార‌ట‌. ఇది కీర‌వాణికి చాలా ఇబ్బందిగా మారింద‌ట‌. కీర‌వాణి ప‌డుతున్న ఇబ్బందిని చూసుకుని ఆయ‌న కుటుంబ స‌భ్యులు, రాజ‌మౌళి కుటుంబ స‌భ్యులు న‌వ్వుకుంటున్నార‌ట‌.

    శ్రీసింహ‌, మిషా నారంగ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా వారాహి చ‌ల‌న చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సాయికొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని .. తెల్ల‌వారితే గురువారం సినిమాను నిర్మించారు. మార్చి 27న సినిమా విడుద‌లవుతుంది. మ‌ణికాంత్ అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు.
    Published by:Anil
    First published: