Home /News /movies /

DO YOU KNOW WHO IS MAHESH BABU DAUGHTER SITARA BEST FRIEND SB

Mahesh Babu:మహేష్ బాబు కూతురు సితార బెస్ట్ ఫ్రెండ్ ఆ స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా ?

సితార

సితార

ఆ హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతోంది మహేష్ బాబు కూతురు సితార. ఆమెతో సమయం గడపాలంటే.. చాలా ఇష్టం అని ఇంటర్వ్యూలో పేర్కొంది సితార.

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు..(Mahesh Babu) గురించి ప్రతీ ఒకరికి తెలిసిందే. తన అందంతో అభినయంతో అందర్నీ కట్టి పడేస్తుంటాడు, ఇటీవలే వచ్చిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాలో మహేష్ మరింత అందంగా కనిపించాడు. మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni)s కూడా అంతే... పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఓ వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. స్టార్ కిడ్‌లో తన తండ్రిలా అందంగా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా సితార ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సితార తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పింది. అంతేకాదు ఆమెతో టైం గడపాలంటే సితారకు ఎంతో ఇష్టం అంట. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరనే కదా మీ డౌట్.

    ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. అవును సితారకు సమంత అంటే చాలా ఇష్టం అంట. నటి సమంతతో ప్రతి క్షణం గడపడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది సితార. బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో సమయంలో తన తండ్రి మహేష్ బాబుతో కలిసి పనిచేస్తున్నప్పుడు సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార తెలిపింది. సమంతతో కలిసి ఉండడం నాకు ఇష్టం’ అని సితార చెప్పుకొచ్చింది. మహేష్ బాబు కూతురు సితార ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు.. మా నాన్నగారి సినిమాల్లో నటించారు. 5 నుంచి 6 ఏళ్ల క్రితం సెట్స్‌లో సరదాగా గడిపినప్పుడు సమంతతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది’ అని సితార చెప్పింది.

    మరోవైపు మహేష్ బాబు కూతురు సితార ఇటీవలే సర్కారు వారి పాట ఆల్బమ్ 'పెన్నీ' ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. గత కొంత కాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేయనుందని ప్రచారం జరుగుతోంది. సర్కారు వారి పాట పెన్నీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో సితార ఉండటంతో ఆమె అనుకున్న దానికంటే త్వరగా నటిగా అరంగేట్రం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మహేష్ బాబు ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు. అయితే మహేష్ మాత్రం తన కూతురు పెద్ద హీరోయిన్ అవుతుందని అన్నారు. అయితే తమ పిల్లలు సినిమా రంగంలోకి రావాలంటే తాను అడ్డు చెప్పానన్నారు. సితార ఫస్ట్ మూవీపై స్పందించేందుకు మాత్రం మహేష్ నిరాకరించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mahesh Babu Daughter Sitara, Samantha Ruth Prabhu, SITARA, Sitara ghattamaneni

    తదుపరి వార్తలు