Hollywood vs Bollywood vs South: పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా సినిమాల సందడి.. ఒకే తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ సినిమాలు ఇవే.. ?

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్ సందర్భంగా చాలామంది దర్శకనిర్మాతలు పెండింగ్‌లో ఉన్న తమ సినిమాలను రిలీజ్ చేయడం కోసం తేదీలను చాలా వేగంగా బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు. ఈ తేదీలను గమనిస్తుంటే హైబడ్జెట్ బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని స్పష్టమవుతోంది.

  • Share this:
దసరా, దీపావళి సందర్భంగా సినిమా (Cinema), ఎంటర్‌టైన్‌మెంట్ (entertainment) మార్కెటింగ్ పెద్ద మొత్తంలో జరుగుతుంది. తరువాతి సంవత్సరం సంక్రాంతి వరకు ఈ హడావుడి కొనసాగుతుంది. దీంతో పండుగ సీజన్ సందర్భంగా చాలామంది దర్శకనిర్మాతలు పెండింగ్‌లో ఉన్న తమ సినిమాలను రిలీజ్ (Release) చేయడం కోసం తేదీలను చాలా వేగంగా బుక్ (booking) చేసుకుంటున్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాల (high budget movies) రిలీజ్ డేట్ల (Release dates)ను ప్రకటించారు. ఈ తేదీలను గమనిస్తుంటే హై బడ్జెట్ బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని స్పష్టమవుతోంది. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

* సూర్యవంశీ, యాంటిమ్, ఎటర్నల్స్ (Eternals)

ఆస్కార్ అవార్డు దర్శకుడు క్లో జావో దర్శకత్వంలో మార్వెల్స్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన "ఎటర్నల్స్" సినిమా దీపావళి (Deepawali) కానుకగా విడుదలకానుంది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ (Soorya Vamshi) సినిమా కూడా దీపావళి సందర్భంగా థియేటర్ల (theaters)లో రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలకు భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ నటించిన "యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్" సినిమాను కూడా దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అదికూడా దీపావళికి విడుదలైతే ఈ మూడు సినిమాల మధ్య పోటీ తప్పక ఉంటుంది.

* 83, ది మ్యాట్రిక్స్: రీసర్రెక్షన్స్ (The Matrix: Resurrections), పుష్ప

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-పార్ట్ 1 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. రణవీర్ సింగ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా '83' కూడా క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. డిసెంబర్ 22న ది మ్యాట్రిక్స్ 4 రీసర్రెక్షన్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక చోప్రా జోనస్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

* వాలిమై, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ (Radhe shyam)

తమిళ స్టార్ అజిత్ కుమార్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా నటుడు ప్రభాస్ 2022 సంక్రాంతి బరిలోకి దిగనున్నారు. వారి సినిమాలు వాలిమై, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

* ఏక్ విలన్ రిటర్న్స్, లాల్ సింగ్ చద్దా (lal singh chaddha)

జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఏక్ విలన్ రిటర్న్స్ వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకులను పలకరించనుంది. కొద్ది రోజుల తర్వాత అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య నటిస్తున్న లాల్ సింగ్ చద్దా విడుదల అవుతుంది.

* ది బ్యాట్ మ్యాన్, బచ్చన్ పాండే (bachhan padey)

దర్శకుడు మాట్ రీవ్స్ దర్శకత్వంలో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా రూపొందుతున్న బ్యాట్ మ్యాన్ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్షయ్ కుమార్, కృతి సనన్ నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాతో ఇది బాక్సాఫీసు వద్ద పోటీ పడనుంది.

* కేజీయఫ్ చాప్టర్ 2, భేదియా (Bhediya)

యాక్షన్ ఫిల్మ్ కేజీయఫ్: చాప్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదే తేదీన, వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన హారర్ కామెడీ "భేదియా" కూడా రిలీజ్ అవుతోంది

* మేడే, హీరోపంటి 2 (Hero Panti)

టైగర్ ష్రాఫ్, తారా సుతారియా తారాగణంలో హీరోపంటి- 2 సినిమా.. ఈద్ సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న "మేడే" కూడా అదే రోజున విడుదల కానుంది.

* ఆదిపురుష్ (Adhi purush), రక్షా బంధన్

అక్షయ్ కుమార్, ప్రభాస్ సినిమాలు ఇండిపెండెన్స్ డే సందర్భంగా బాక్సాఫీస్ (box office) వద్ద పోటీ పడనున్నాయి. ఈ రెండూ ఆగస్టు 11, 2022న విడుదల కానున్నాయి.

* విక్రమ్ వేద, మిషన్ ఇంపాజిబుల్: 7
పుష్కర్, గాయత్రి దర్శకత్వంలో సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ తారాగణంలో తమిళ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదకి హిందీ రీమేక్ గా వస్తున్న హిందీ విక్రమ్ వేద సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 కూడా అదే రోజున విడుదలకు సిద్ధంగా ఉంది.
Published by:Prabhakar Vaddi
First published: