Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 18, 2019, 7:37 PM IST
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా
బాడీగార్డ్ అంటే రక్షకుడు అని అర్థం.. అంటే యజమాని ప్రాణానికి ముప్పు వస్తే ముందు తన ప్రాణం అడ్డేసే ఓ ఆయుధం అన్నమాట. మరి అలాంటి వాడికి ఎంత జీతం ఇచ్చినా తక్కువే కదా. కానీ అంత నమ్మకమైన బాడీగార్డ్స్ ఎంతమందికి ఎక్కడ దొరుకుతారు.. నిజంగా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడే స్వార్థం లేని బాడీగార్డ్స్ ఇప్పుడు దొరకడం కాస్త కష్టమే. కానీ దొరికాడు.. సల్మాన్ ఖాన్కు అలాంటి వాడే దొరికాడు. అతడి పేరు షెరా. పేరుకు అంగరక్షకుడు కానీ సల్మాన్ ఖాన్కు షెరా అంటే ప్రాణం. సొంతింటి మనిషిలాగే ట్రీట్ చేస్తాడు అతన్ని.

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా
ఇక షెరా కూడా తన ప్రాణం కంటే సల్మాన్ ప్రాణమే ముఖ్యమంటాడు. ఈ ఇద్దరూ అలా కలిసిపోయారు మరి. ఇప్పుడు కాదు.. 1996 నుంచి సల్మాన్ కోసం ప్రాణమిచ్చే సెక్యూరిటీగా పని చేస్తున్నాడు షెరా. మరి అలాంటి వాడికి జీతం ఎంతివ్వాలి.. బయట ఎంతమంది ఆఫర్ చేసినా కూడా అక్కడే పని చేస్తున్నాడు షెరా. అందుకే సల్మాన్ కూడా అతడికి కావాల్సినంత జీతం ఇస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా
నెలకు ఒకటి రెండు కాదు.. ఏకంగా 15 నుంచి 20 లక్షల వరకు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దానికితోడు అదనపు అలవెన్సులు కూడా ఉంటాయి. మొత్తంగా ఏడాదికి దాదాపు 2.5 కోట్ల వరకు షెరా సంపాదన ఉంటుందని లెక్కలు కడుతున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఇది చూసి నిజంగానే అంతా షాక్ అవుతున్నారు. ఏదేమైనా కూడా తనను ప్రాణంగా చూసుకునే బాడీగార్డ్ ముందు ఈ లక్షలు అసలు లెక్కే కాదంటున్నాడు కండల వీరుడు. ఈ మధ్యే ఆయనకు ఓ సొంతిల్లు కూడా కొనిచ్చాడు సల్మాన్ ఖాన్.
Published by:
Praveen Kumar Vadla
First published:
October 18, 2019, 7:37 PM IST