• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DO YOU KNOW THE RESTAURANT MENU BOLLYWOOD STAR ACTRESS PRIYANKA CHOPRA PK GH

Priyanka Chopra: బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంక చోప్రా రెస్టారెంట్ మెనూ ఏంటో తెలుసా..?

Priyanka Chopra: బాలీవుడ్​ బ్యూటీ ప్రియాంక చోప్రా రెస్టారెంట్ మెనూ ఏంటో తెలుసా..?

ప్రియాంక చోప్రా (Priyanka Chopra bold photoshoot)

Priyanaka Chopra: సినీ రంగంలో స్టార్​ హీరోయిన్స్​గా రాణిస్తూ అధిక మొత్తంలో రెమ్యునరేషన్​ పొందుతున్న చాలామంది సెలబ్రిటీలు దాంతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా సినిమాల్లో సంపాదించిన..

  • Share this:
సినీ రంగంలో స్టార్​ హీరోయిన్స్​గా రాణిస్తూ అధిక మొత్తంలో రెమ్యునరేషన్​ పొందుతున్న చాలామంది సెలబ్రిటీలు దాంతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా సినిమాల్లో సంపాదించిన డబ్బుతో ఫ్యాషన్​, ఫుడ్, రియల్​ ఎస్టేట్​ ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా, ఈ ధోరణి హీరోల కంటే హీరోయిన్స్​లోనే ఎక్కువగా ఉంటోంది. తాజాగా, ఈ జాబితాలోకి బాలీవుడ్​ నటి ప్రియాంక చోప్రా ఎంటర్​ అయ్యింది. అమెరికన్​ పాప్​ సింగర్​ నిక్​ జోనస్​ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత బాలీవుడ్​ నుంచి హాలీవుడ్​కు షిఫ్ట్​ అయిన ఈ బ్యూటీ వరల్డ్​ వైడ్​గా ఫేమస్​ అయిన సంగతి తెలిసిందే. అయితే, హాలీవుడ్​లో మంచి ఆఫర్లు కొట్టేస్తూ.. కెరీర్​​లో మంచి దశలో ఉన్న పీసీ ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతోంది. తాజాగా, న్యూయార్స్​లో ఈ అమ్మడు ‘సోనా’ పేరుతో సరికొత్త రెస్టారెంట్​ను ప్రారంభించింది.

భర్త నిక్​ జోనస్​తో కలిసి రెస్టారెంట్​ పూజ చేసిన ఫోటోల్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. “సినిమాల తర్వాత నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్​లోకి అడుగు పెడుతున్నా. నా రెస్టారెంట్ కి​ సోనా అనే పేరు పెట్టాను. సోనా అనేది బంగారం లాంటి భారత వంటకాలకు స్వరూపం.


నేను భారత్​లోనే పెరిగాను కాబట్టి, నా అభిరుచికి తగ్గట్లు, నేను తింటూ పెరిగిన వంటకాలన్నీ ఇందులో అందుబాటులో ఉంచుతాను.” అని అన్నారు. అయితే, ఈ అమ్మడు కొత్త రెస్టారెంట్​ ప్రారంభిస్తున్నానని ప్రకటించగానే.. ఆశ్చర్యపోయిన సోషల్ మీడియా నెటిజన్లు, ఆ రెస్టారెంట్​లో దొరికే వంటకాలపై నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అయితే, అటు ప్రియంక మాత్రం తన పోస్ట్​లో రెస్టారెంట్ మెనూపై ఎటువంటి క్లూ ఇవ్వలేదు. అయినప్పటికీ మెనూ ఇదేనంటూ సోషల్​మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ, మార్చి 2021 చివరి నాటికి ఈ రెస్టారెంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నందున, సోషల్​ మీడియాలో ఒక క్లాసిక్ మెనూ చక్కర్లు కొడుతోంది.


సోనా రెస్టారెంట్​లో భారత సాంప్రదాయ వంటకాలు చిల్లీ చీజ్​ నాన్​, జీడిపప్పు సాస్​తో కూడిన కోఫ్తా కోర్మా వంటివి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, వీటి తయారీకి ప్రముఖ చెఫ్​ హరి నాయక్​ను నియమించినట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రాకు భారతీయ ఆహారం, ముఖ్యంగా పంజాబీ ఆహారం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె పలు ఇంటర్వూల్లో వెల్లడించింది. అందువల్ల, నూతనంగా ప్రారంభించే రెస్టారెంట్​లో ఇండియన్​ ఫుడ్​ ఐటమ్స్​కు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఫారెన్​తో పాటు ఇండియన్ వెరైటీస్​ అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ రెస్టారెంట్​ బిజినెస్​ను ఆమె స్నేహితులు మనీష్ గోయల్, డేవిడ్ రాబిన్​లు చూసుకోనున్నారు. మొత్తానికి, అటు సినిమా హీరోయిన్​గానే కాకుండా.. ఇటు బిజినెస్​ ఉమన్​గా కూడా సత్తా చాటబోతుంది ప్రియాంక చోప్రా.
First published:

అగ్ర కథనాలు