• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • DO YOU KNOW THE REMUNERATION OF KEERTHY SURESH PER ONE MOVIE AND HERE THE DETAILS PK

కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు భారీగానే తీసుకుంటుందిగా..

కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు భారీగానే తీసుకుంటుందిగా..

కీర్తి సురేష్ (Keerthy suresh)

Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది కీర్తి సురేష్. ఇక సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెను మాత్రం సావిత్రిలాగే గుర్తు పెట్టుకుంటారు ఈ తరం ప్రేక్షకులు.

  • Share this:
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది కీర్తి సురేష్. ఇక సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెను మాత్రం సావిత్రిలాగే గుర్తు పెట్టుకుంటారు ఈ తరం ప్రేక్షకులు. అంతేకాదు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది కీర్తి. ఇప్పుడు ఈమె వరస సినిమాలతో బిజీగా ఉంది. అందులో కొన్ని పూర్తైపోయాయి కూడా. అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. కానీ ఓటిటి ప్లాట్ ఫామ్‌లోనే కీర్తి సురేష్ సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే పెంగ్విన్ సినిమా విడుదలైంది కూడా.

కీర్తి సురేష్ (Keerthy suresh)
కీర్తి సురేష్ (Keerthy suresh)


పెంగ్విన్ సినిమాను జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మిస్ ఇండియా సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో పాటు తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తుంది. తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా మారిపోయింది కీర్తి సురేష్. ఇంత బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఒక్కో సినిమా కోసం ఎంత తీసుకుంటుందో తెలుసా..?

కీర్తి సురేష్ (Keerthy suresh)
కీర్తి సురేష్ (Keerthy suresh)


సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికం అందుకుంటుంది కీర్తి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయితే కోటిన్నర వరకు తీసుకుంటుందని.. హీరోయిన్ పాత్ర అయితే కోటి తీసుకుంటుందని తెలుస్తుంది. పైగా ఇప్పుడ ఈమె సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు.

కీర్తి సురేష్ పెంగ్విన్ (keerthy suresh)
కీర్తి సురేష్ పెంగ్విన్ (keerthy suresh)


పెంగ్విన్‌కు నిర్మాతలకు లాభాలు రావడంతో కచ్చితంగా ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జ్యోతిక, అమితాబ్‌, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్స్ నటించిన సినిమాలను నేరుగా అమోజాన్‌ ప్రైమ్‌లో విడుదలయ్యాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ సహా మరికొందరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఓటిటిలో విడుదల కానున్నాయి. మొత్తానికి ఓటిటి క్వీన్ కావడమే కాకుండా కోటితారగా కూడా మారిపోయింది కీర్తి సురేష్.
Published by:Praveen Kumar Vadla
First published: