Suma Kanakala: తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకరింగ్‌లో ఆమెను ఎవ్వరూ దాటలేరన్నది ప్రేక్షకులు ఎరిగిన సత్యం. నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళుతున్న సుమపై కామెంట్లు చేయాలని ఎవ్వరికీ అనిపించదు. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక కొంతమంది అయితే తాము పుట్టినప్పటి నుంచి సుమ యాంకరింగ్ చేస్తుందంటూ ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు. ఈమె మాతృభాష మలయాళం అయినప్పటికీ.. పట్టుబట్టి తెలుగు నేర్చుకొని తెలుగు బుల్లితెరపై మహారాణిగా దూసుకుపోతుంది సుమ. ఇదిలా ఉంటే సుమ యాంకర్‌గా మొదటగా చేసిన షో ఏంటో తెలుసా.
2006లో స్టార్ మా(అప్పుడు మాటీవీ)లో వచ్చిన అవాక్కయ్యారా గేమ్ షోకు మొదట వ్యాఖ్యతగా చేశారు సుమ. అంతకుముందు సీరియళ్లలో, సినిమాల్లో హీరోయిన్గా నటించిన సుమ.. అవాక్కయ్యారాతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పట్టుకుంటే పట్టుచీర, స్టార్ మహిళ, పట్టుకుంటే పట్టుచీర, భలే ఛాన్సులే, కిక్కే కిక్కు, పెళ్లిచూపులు ఇలా పలు షోలతో దూసుకుపోయారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఎంటర్టైన్మెంట్ ఛానెల్లోనూ సుమ ప్రోగ్రామ్‌లు ఉంటున్నాయి. ఆమెతో పాటు ఇప్పుడు పలువురు కూడా వ్యాఖ్యతలుగా మారి షోలు చేస్తున్నప్పటికీ.. సుమ షోకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆమె చేసే ప్రతి ప్రోగ్రామ్ మంచి టీఆర్పీలను సంపాదించుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే సుమ కుమారుడు రోహన్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నిర్మలా కాన్వెంట్లో ఒక పాత్రలో నటించిన రోహన్.. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే రోహన్ మొదటి చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మరోవైపు సుమ కుమార్తె కూడా సినీ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.