హీరోగా సుడిగాలి సుధీర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

Jabardasth Sudigali Sudheer Remuneration : ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాకు అతను పనిచేస్తున్నాడు. రాజుగారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి,షియాజీ షిండే సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 1:51 PM IST
హీరోగా సుడిగాలి సుధీర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
సుడిగాలి సుధీర్ (File)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు సుడిగాలి సుధీర్. కేవలం స్కిట్స్ మాత్రమే కాదు.. యాంకరింగ్, సింగింగ్, డ్యాన్సింగ్‌లోనూ అప్పుడప్పుడు అదరగొడుతుంటాడు.అందుకేనేమో ఈమధ్య హీరో వేషాలు కూడా అతన్ని వెతుకుంటూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమాకు అతను పనిచేస్తున్నాడు. రాజుగారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి,షియాజీ షిండే సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే.. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా కోసం సుధీర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..? దాదాపు రూ.30లక్షల వరకు తీసుకుంటున్నాడని టాక్. జబర్దస్త్ షోలో అత్యధిక పారితోషికం అందుకుంటున్నవాళ్లలో సుధీర్ కూడా ఒకడు. ఇప్పుడు సినిమాలతోనూ బిజీ అవుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. సుధీర్‌కి గనుక హిట్టు సినిమాలు పడితే.. అతని కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయమంటున్నారు. చూడాలి మరి.. బుల్లితెర లాగే సుధీర్‌కు వెండితెర కలిసొస్తుందో లేదో..!

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు