Pawan Kalyan first remuneration: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషికం ఎంతంటే..?

పవన్ కళ్యాణ్ (Pawan kalyan)

Pawan Kalyan first remuneation: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) సినిమా చేయాలంటే నిర్మాతకు 50 కోట్లు ఇవ్వక తప్పదు. కానీ ఇదే పవన్‌తో తొలి సినిమాను చాలా తక్కువ పారితోషికంతోనే చేసాడు అల్లు అరవింద్ (Allu Aravind).

  • Share this:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎవ్వరికి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలంటే నిర్మాతకు 50 కోట్లు ఇవ్వక తప్పదు. కానీ ఇదే పవన్‌తో తొలి సినిమాను చాలా తక్కువ పారితోషికంతోనే చేసాడు అల్లు అరవింద్. అప్పట్లో పవన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎన్నో..? తమ్మున్ని పర్ఫెక్ట్‌గా లాంఛ్ చేయడానికి చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తర్వాత చివరికి ఈవీవీ సత్యనారాయణ కుదిరాడు. అప్పటికే హిందీలో వచ్చి హిట్టైన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను తెలుగులో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి రీమేక్ చేసాడు ఈవీవీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా అక్కినేని వారమ్మాయి సుప్రియను తీసుకుని మెగా, అక్కినేని కుటుంబాల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు ఈయన. ఇదిలా ఉంటే పవన్ పోస్టర్ డిజైన్స్.. ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేసాడు ఈవీవీ. ఆ రోజుల్లోనే ఈయన చేసిన ప్రమోషన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించారు.. సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్స్ విడుదల చేసారు. దాంతో ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దానికి తోడు చిరంజీవి తమ్ముడు అంట అంటూ అంచనాలు కూడా పెరిగిపోయాయి.

పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)


అలా వచ్చింది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాకు పవన్ తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నెలకు 5 వేల రూపాయలు ఇచ్చాడు నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయం అప్పట్లో పవన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సొంత నిర్మాణ సంస్థ కావడంతో అలా ఇచ్చుంటాడంటారు విశ్లేషకులు. పైగా అప్పటికి పవన్ ఎవరికీ తెలియదు. దాంతో తొలి సినిమాకు చాలా తక్కువ పారితోషికమే తీసుకున్నాడు పవన్. అదే ఇప్పుడు పవన్‌తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లు ఇవ్వాల్సిందే. 5 వేలతో మొదలై 50 కోట్లకు తన రేంజ్ పెంచుకున్న పవన్ 25 ఏళ్ల ప్రయాణం అద్భుతమే. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా దుమ్ము దులిపేస్తున్నాడు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)


అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మొదట్లో కూడా ఇతడే మనకు కావాల్సిన కళ్యాణ్ బాబూ అంటూ వేసాడు దర్శకుడు ఈవీవీ. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్‌ను అద్భుతంగా ప్రమోట్ చేసాడు. ఇక ఇందులో పవన్ చేసిన రియల్ ఫీట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా ఓ ఐటం సాంగ్ చేసింది. ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, కమెడియన్స్ అంతా ఈ సినిమాలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ అయినా కూడా పవన్ కెరీర్‌కు పర్ఫెక్ట్ లాంఛ్ అయింది. ఆ తర్వాత ఖుషీ వరకు వరస విజయాలతో టాప్ హీరో అయిపోయాడు పవర్ స్టార్. ఇప్పుడు ఈయన చేతిలో 4 సినిమాలున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: