#RRR : లీకైన ఎన్టీఆర్,రాంచరణ్ రెమ్యునరేషన్ వివరాలు..

RRR : ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల కానుంది.అప్పటివరకు ఎన్టీఆర్,రాంచరణ్ ఇద్దరూ ఇదే ప్రాజెక్టుతో లాక్ అయిపోనున్నారు. మామూలుగా అయితే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్,రాంచరణ్ రెండేసి సినిమాలు చేసేవారు.

news18-telugu
Updated: September 4, 2019, 6:26 PM IST
#RRR : లీకైన ఎన్టీఆర్,రాంచరణ్ రెమ్యునరేషన్ వివరాలు..
ఆర్ఆర్ఆర్ ప్రారంభోత్సవంలో రాజమౌళి, రామ్‌చరణ్, దానయ్యలతో తారక్
  • Share this:
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR.ఇద్దరు బడా హీరోలతో.. అదీ చారిత్రక యోధులైన అల్లూరి,కొమురం భీమ్‌ల జీవిత స్ఫూర్తితో తెరకెక్కుతోన్న చిత్రం
కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల కానుంది.అప్పటివరకు ఎన్టీఆర్,రాంచరణ్ ఇద్దరూ ఇదే ప్రాజెక్టుతో లాక్ అయిపోనున్నారు. మామూలుగా అయితే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్,రాంచరణ్ రెండేసి సినిమాలు చేసేవారు. కానీ రాజమౌళి సినిమా కావడంతో దాదాపు ఏడాదిన్నర సమయం వెచ్చించక తప్పట్లేదు. మరి ఇంత సమయాన్ని,శ్రమను వెచ్చిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్,రాంచరణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న ప్రశ్న సహజంగానే అభిమానుల్లో తలెత్తుతోంది.

ఫిలింనగర్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ ఇద్దరు హీరోలు చెరో రూ.25కోట్లు చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.15కోట్లు తీసుకునే ఈ హీరోలు.. ఆర్ఆర్ఆర్‌కు ఎక్కువ డేట్లు కేటాయించాల్సి రావడంతో ఇంత భారీ స్థాయిలో రెమ్యురేషన్ అందుకుంటున్నారట. రెమ్యునరేషన్ సంగతి పక్కనపెడితే.. రాజమౌళితో పనిచేయడమంటేనే కొత్త విషయాలను నేర్చుకోవడం అని సినిమా అనౌన్స్ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అంటే,రాజమౌళి సినిమాకు రెమ్యునరేషన్ లెక్కల కంటే.. అది తమ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం అవుతుందనేదే ఈ హీరోల ప్రియారిటీగా కనిపిస్తోంది. మొత్తం మీద బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో మళ్లీ ఆ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ అనడంలో సందేహం లేదు.చూడాలి మరి.. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి ఇంకెన్ని కొత్త రికార్డులను సెట్ చేయబోతున్నాడో..!
Published by: Srinivas Mittapalli
First published: September 4, 2019, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading