నాగ చైతన్యకు ఎంతమంది తమ్ముళ్లు ఉన్నారు..? అదేంటి కొత్తగా అడుగుతున్నారు అఖిల్ ఒక్కడే కదా అనుకుంటున్నారా..? అవును.. అందరికీ తెలిసిన నిజం అఖిల్ ఒక్కడే కానీ చైతూకు మరో తమ్ముడు కూడా ఉన్నాడనేది చాలా మందికి తెలియని నిజం. అక్కినేని వంశం కాదు కానీ చైతూకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ కూడా బాగానే నడుస్తుంది. అందులో చిత్రమేం లేదు. ఎందుకంటే చైతూ అమ్మగారు లక్ష్మితో ఒకప్పుడు నాగార్జున పెళ్లి జరిగింది. రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున.. కొన్నేళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారే కానీ ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఏ ఇంట్లో వేడుక జరిగినా కూడా రెండు కుటుంబాలు కలిసి వేడుక చేసుకుంటాయి. అంతేకాదు నాగార్జున, వెంకటేష్ కూడా అంతే స్నేహంగా కనిపిస్తుంటారు. అసలు ఏ మాత్రం పాత విషయాలు గుర్తు చేసుకోరు.. పెట్టుకోరు కూడా. గతం గత: అన్నట్లుగానే ఎవరి జీవితం వాళ్లు గడిపేస్తున్నారు. నాగార్జున నుంచి విడిపోయిన తర్వాత లక్ష్మి మరో పెళ్లి చేసుకుంది.
అలాగే నాగార్జున కూడా అమలను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు అఖిల్ ఉన్నాడు. మరోవైపు లక్ష్మి జీవితంలోకి కూడా ఒకరొచ్చారు. చెన్నైలో ఉన్న బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్ని పెళ్లి చేసుకున్నారు లక్ష్మి. కొన్నేళ్ల వరకు చైతన్య తల్లి దగ్గరే పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాడు. ఇక్కడే తండ్రి దగ్గరే ఉన్నాడు. నాగ్ దగ్గర ఉన్నా కూడా చైతూ ఆలనపాలన తల్లి చూసుకుంటూనే ఉంది. మరోవైపు సమంతతో తన పెళ్లికి కూడా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు లక్ష్మి, శరత్ విజయరాఘవన్ దంపతులకు కూడా ఓ కొడుకున్నాడు. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు అంత సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నారు కాబట్టి.
కొన్నేళ్ల కింద లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లి ఘనంగా చెన్నైలో జరిగింది. ఈ పెళ్ళికి చైతు, సామ్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. తమ్ముడి పెళ్లికి వెళ్లి మనస్పూర్థిగా ఆలోచించాడు చైతన్య. మరోవైపు సమంతకు అత్తయ్య లక్ష్మి అంటే చాలా గౌరవం. ఆమె ఎంతో వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటుంది సమంత. ఏదేమైనా కూడా అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్నమాట. ఆయనకు సినిమాలకు అస్సలు సంబంధం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni akhil, Naga Chaitanya, Telugu Cinema, Tollywood