HOME »NEWS »MOVIE »do you know about the movie which sr ntr and megastar chiranjeevi acted hsn

Sr NTR- Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్లో ఒకే ఒక్క సినిమా.. 40 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!

Sr NTR- Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్లో ఒకే ఒక్క సినిమా.. 40 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!
సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి(ఫైల్ ఫొటోలు)

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వచ్చే ఒక్కో న్యూస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే నందమూరి, మెగా ఫ్యామిలీ కాంబినేషన్లో ఇంతకుముందే ఓ సినిమా వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియదు. సోమవారం(జనవరి 18) ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా ఆ సినిమా విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.

  • Share this:
    కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేలా చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారంటేనే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పవన్ కల్యాణ్, రానా కలిసి నటిస్తున్న అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కోసం కూడా అదే స్థాయిలో మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అన్నింటికీ మించి నందమూరి-మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తున్న ’ఆర్ఆర్ఆర్‘ సినిమా గురించి అయితే ఇక వేరే చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో మెగా, నందమూరి కుటుంబాలకు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు. అందుకే ఆ రెండు కుటుంబాల హీరోలు కలిసి నటిస్తుండటం, దానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

    ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వచ్చే ఒక్కో న్యూస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే నందమూరి, మెగా ఫ్యామిలీ కాంబినేషన్లో ఇంతకుముందే ఓ సినిమా వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియదు. సోమవారం(జనవరి 18) ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా ఆ సినిమా విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.



    సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు ఈ సినిమా విడుదల అయింది. 1981వ సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంట్లో ఎన్టీఆర్ లాయర్ గా నటించారు. చిరంజీవి క్లబ్ లో పాటలు పాడే రోల్ ను ప్లే చేశారు. ఎన్టీఆర్ చెల్లికి భర్తగా, నెగిటివ్ రోల్ లో చిరంజీవి నటించడం గమనార్హం. సినిమా చివరిదాకా చిరంజీవి ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ను పోషించారు. చివర్లలో బావ వెంట నిలిచి రౌడీ మూకల ఆటను కట్టిస్తారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కే దేవీ వరప్రసాద్ నిర్మాతగా, కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

    ఈ సినిమా వచ్చిన 40 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా, నందమూరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ గ్యాప్ లో బాలయ్య, చిరంజీవితో సినిమాను ప్లాన్ చేయాలని పలువురు డైరెక్టర్లు యత్నించినా, సరైన కథ దొరక్క ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. మొత్తానికి రాజమౌళి ఆ ఛాన్స్ ను కొట్టేసి, ఆర్ఆర్ఆర్ తో మరో చరిత్రను లిఖించే పనిలో పడ్డారు. ఈ సినిమా కోసం నందమూరి, మెగా అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. మరి ఆ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో, ఎంత సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.
    Published by:Hasaan Kandula
    First published:January 18, 2021, 16:00 IST

    टॉप स्टोरीज