హోమ్ /వార్తలు /సినిమా /

ఆత్మహత్యకు సిద్దపడిన నాగబాబు దగ్గర అన్ని వందల కోట్ల ఆస్తి ఉందా..

ఆత్మహత్యకు సిద్దపడిన నాగబాబు దగ్గర అన్ని వందల కోట్ల ఆస్తి ఉందా..

నాగబాబు (Facebook/Photo)

నాగబాబు (Facebook/Photo)

ఔను ఒకప్పుడు తన అన్న కొడకు రామ్ చరణ్‌తో ‘ఆరెంజ్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న నాగబాబు.. ఒకానొక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనున్నట్టు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అటువంటి నాగబాబు టీవీ రియాలిటీ షో జబర్ధస్త్‌తో పాటు.. అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో బాగానే వెనకేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

ఇంకా చదవండి ...

  ఔను ఒకప్పుడు తన అన్న చిరంజీవి  కొడకు రామ్ చరణ్‌తో ‘ఆరెంజ్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న నాగబాబు.. ఒకానొక పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనున్నట్టు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అటువంటి నాగబాబు టీవీ రియాలిటీ షో జబర్ధస్త్‌తో పాటు.. అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో బాగానే వెనకేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. నాగబాబు.. అలియాస్ కొణిదెల నాగేంద్రబాబు..  నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు.

  అన్నయ్య చిరుతో నిర్మించిన ‘రుద్రవీణ’ సినిమాతో నిర్మాతగా మారిన నాగబాబు (Facebook/Photo)

  ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రం కాస్తా పర్వాలేదనిపించింది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.

  konidela mega family heroes chiranjeevi pawan kalyan ram charan many other family heroes not playing real life characters in silver screen,megastar chiranjeevi,mega family heroes,venky mama,venkatesh naga chaitanya venky mama,naga chaitanya nagarjuna anr,nandamuri family,balakrishna ntr,Ghattamaneni family,mahesh babu krishna,krishnam raju,prabhas,pawan kalyan,tollywood,telugu cinema,వెంకీమామ,వెంకీ మామ,వెంకటేష్ నాగ చైతన్య,నాగ చైతన్య నాగార్జున ఏఎన్నార్,కృష్ణ మహేష్ బాబు,ఘట్టమనేని ఫ్యామిలీ,అక్కినేని ఫ్యామిలీ,దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ,బాలకృష్ణ ఎన్టీఆర్,మెగా ఫ్యామిలీ,కొణిదెల ఫ్యామిలీ,చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్,
  చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో నాగబాబు (Twitter/Photo)

  ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఐతే.. జబర్ధస్త్ షోలో ఒక్కో షోకు దాదాపు రూ.5 లక్షలు ఛార్జ్ చేసే నాగబాబు.. ఇపుడు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదరింది’ షోకు మాత్రం అంతకు రెట్టింపుగా పారితోషకం అందుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ అంతగా సక్సెస్ కాలేకపోయినా... నాగబాబు తన ఆస్తులు పెంచుకునే విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. లాక్‌డౌన్ తర్వాత ‘అదిరింది’ ప్రోగ్రామ్ మళ్లీ మొదలుపెట్టనున్నారు. ఇందులో వచ్చిన రెమ్యునరేషన్‌తో నాగబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టు సమాచారం. అక్కడైతే కొన్ని ఒడిదుడుకులు ఎదరైన డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదనే ఉద్యేశ్యంతో అందులో పెట్టినట్టు సమాచారం.

  jabardasth comedy show,jabardasth skits,hyper aadi,adirindi comedy show,gully boyz saddam,express hari,nagababu,జబర్దస్త్ కామెడీ షో, అదిరింది కామెడీ షో, నాగబాబు, హైపర్ ఆది, సద్దాం, ఎక్స్‌ప్రెస్ హరి
  నాగబాబు (Nagababu)

  సినిమాలు, టీవీ ప్రోగ్రాములు పక్కనపెడితే.. నాగబాబు.. మొన్నటి ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతేకాదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. ఈ ఎన్నికల్లో నాగబాబు..ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినపుడు నాగబాబు..  ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనకు, తన భార్యకు కలిపి రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. ఇందులో వాహనాలు వంటి చరాస్థులు రూ.36.73 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక  స్థిరాస్థుల విషయానికొస్తే  రూ.4.22 కోట్లుగా  చూపించారు. దీంతో పాటు రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు చూపించారు. మొత్తంగా చూస్తే.. నికరంగా రూ.38 కోట్లు ఆస్తులున్నాయి. అదే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే.. రూ.100 కోట్ల పైనే ఉండొచ్చని చెబుతున్నారు. ఇక అదిరింది ఇతరత్రా ప్రోగ్రామ్స్‌తో అది కలుపుకుంటే రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లకు చేరిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Adirindi comedy show, Jabardasth comedy show, Nagababu, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు