Jabardasth : జబర్దస్త్ షోలో అతి తక్కువ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Jabardasth Remuneration : బబర్దస్త్ షో పాపులారిటీ ఎంతలా పెరిగిపోయిందంటే.. ఆఖరికి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు.. అందులో నటించే అవకాశం ఇవ్వండి చాలు అని కొంతమంది ఆ షో డైరెక్టర్స్,టీమ్ లీడర్స్ చుట్టూ తిరుగుతున్నారట. జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుంటే.. బయట మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చుననేది వారి ఆలోచనగా తెలుస్తోంది.

news18-telugu
Updated: September 21, 2019, 4:39 PM IST
Jabardasth : జబర్దస్త్ షోలో అతి తక్కువ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
జబర్దస్త్ లోగో
news18-telugu
Updated: September 21, 2019, 4:39 PM IST
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.జనాలకు విపరీతంగా కనెక్ట్ అయిన ఈ షో ద్వారా.. అందులో నటించేవాళ్లు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే జబర్దస్త్ నటుల్లో ఎవరికెంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఓ ప్రముఖ చానెల్ వీరి రెమ్యునరేషన్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

జబర్దస్త్ నటుల్లో అందరి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నవారిలో చమ్మక్ చంద్ర,సుడిగాలి సుధీర్ ఉన్నారు. వీరిద్దరు నెలకు రూ.4లక్షల దాకా పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో దూసుకెళ్లే హైపర్ ఆదికి వీరి కంటే తక్కువ రెమ్యునరేషన్ ఉండటం గమనార్హం. ఆదికి నెలకు రూ.3లక్షల పారితోషికం అందుతున్నట్టు సమాచారం. ఇక మిగతా టీమ్ లీడర్స్‌కు రూ.2.5లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇక షోకి సంబంధించి అతి తక్కువ రెమ్యునరేషన్ రూ.75వేలుగా ఉన్నట్టు సమాచారం. షోలో ఎంట్రీ ఇచ్చే కొత్తవాళ్లందరకీ ఇదే రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

జబర్దస్త్ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగరాజు,రోజాలు అందరి కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్నారు. నాగబాబు నెలకు రూ.20లక్షల వరకు పారితోషికం అందుతుండగా.. రోజాకు నెలకు రూ.16లక్షల పైనే పారితోషికం అందుతున్నట్టు తెలుస్తోంది. ఇక యాంకర్స్ విషయానికొస్తే.. అనసూయకు నెలకు రూ.4లక్షలు,రష్మీ గౌతమ్‌కు రూ.3లక్షలు అందుతున్నట్టు టాక్. మొత్తంగా జబర్దస్త్ షో.. బంగారు గుడ్లు పెట్టే బాతులా మారిపోయిందంటున్నారు. ఆఖరికి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్లేదు.. అందులో నటించే అవకాశం ఇవ్వండి చాలు అని కొంతమంది ఆ షో డైరెక్టర్స్,టీమ్ లీడర్స్ చుట్టూ తిరుగుతున్నారట. జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుంటే.. బయట మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చుననేది వారి ఆలోచనగా తెలుస్తోంది.



First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...