Jabardasth : జబర్దస్త్‌లోకి రాకముందు ఆ కమెడియన్స్ ఏం చేసేవాళ్లో తెలుసా?

జబర్దస్త్‌తో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయి ఉండవచ్చు. కానీ గతంలో వాళ్లు కూడా చాలా కష్టాలు పడినవాళ్లే. చిన్నా చితకా పనులు చేస్తూ బండి లాక్కొచ్చినవాళ్లు కొంతమందైతే.. సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాలు చేసినవాళ్లు కూడా జబర్దస్త్‌లో ఉన్నారు.

news18-telugu
Updated: September 28, 2019, 12:37 PM IST
Jabardasth : జబర్దస్త్‌లోకి రాకముందు ఆ కమెడియన్స్ ఏం చేసేవాళ్లో తెలుసా?
జబర్దస్త్ లోగో
  • Share this:
జబర్దస్త్ అంటేనే జనాల్లో ప్రత్యేకమైన ఆసక్తి. ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే లక్షల సంఖ్యలో వ్యూయర్‌షిప్ సంపాదించుకున్న ఈ కార్యక్రమం బుల్లితెరపై తన దండయాత్రను కొనసాగిస్తూనే ఉంది. షోకి మంచి పాపులారిటీ,రేటింగ్ ఉండటంతో.. అందులో నటిస్తున్న కమెడియన్స్ కూడా బాగానే సంపాదించుకుంటున్నారు. జబర్దస్త్‌తో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయి ఉండవచ్చు. కానీ గతంలో వాళ్లు కూడా చాలా కష్టాలు పడినవాళ్లే. చిన్నా చితకా పనులు చేస్తూ బండి లాక్కొచ్చినవాళ్లు కొంతమందైతే.. సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాలు చేసినవాళ్లు కూడా జబర్దస్త్‌లో ఉన్నారు.

జబర్దస్త్ షో ద్వారా హీరోయిక్ ఇమేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. గతంలో మెజీషియన్‌గా పనిచేసేవాడు.మ్యాజిక్ షోలు చేస్తూ.. వాటి ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవితం గడిపేవాడు. ఫ్యామిలీ స్కిట్స్‌తో కడుపుబ్బా నవ్వించే చమ్మక్ చంద్ర.. గతంలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవితం సాగించేవాడు. దినసరి కూలీగా ఆరోజుకు దొరికే డబ్బుతోనే జీవితం సాగిపోయేది. ఇక రైటర్‌ మంచి పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ గతంలో హోల్ సేల్ మెడికల్ రంగంలో పనిచేసేవాడు. అలాగే కిరాక్ ఆర్పీ గతంలో
ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేశాడు. అదిరే అభి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయగా.. రాకెట్ రాఘవ దూరదర్శన్ స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. ఇక చలాకీ చంటి గతంలో ఆర్జేగా పనిచేయగా.. ముక్కు అవినాష్ 'టీ బాయ్'గా పనిచేశాడు.చిన్న స్థాయి నుంచి ఈరోజు వీళ్లంతా ఒక మంచి స్థాయికి చేరుకున్నారంటే.. అంతా జబర్దస్త్ షో వల్లే. అందుకే వీళ్లందరికి జబర్దస్త్ షో పట్ల ఎనలేని అభిమానం.



First published: September 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...