Home /News /movies /

DO YOU KNOW ABOUT GUESS ABOUT THIS HEROINE WHO WAS COVERED IN MUD IN THIS PHOTO TA

ఈ ఫోటోలో ఒంటికి మట్టి పూసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..

మడ్ బాత్ చేస్తోన్న బాలీవుడ్ భామ (Instagram/Photo)

మడ్ బాత్ చేస్తోన్న బాలీవుడ్ భామ (Instagram/Photo)

ఈ ఫోటోలో ఒంటికి మట్టి పూసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. గుర్తు పట్టలేదా ఈమె ఎవరో కాదు.. 

    ఈ ఫోటోలో ఒంటికి మట్టి పూసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. గుర్తు పట్టలేదా ఈమె ఎవరో కాదు.. బాలీవుడ్‌లో హాట్ స్కిన్ షోతో పాపులర్ అయిన ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). తాజాగా ఈమె మడ్ బాత్ నేపథ్యంలో శరీరం మొత్తానికి ముత్తాన్ మట్టి పూసుకొని ఎండలో కూర్చుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ఊర్వశి రౌతెలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఊర్వశి రౌతెలా విషయానికొస్తే.. ఆమె చేసిన సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే పోస్టులతో ఎక్కువగా పాపులర్ అయింది. ఊర్వశి రౌతెలా (Urvashi Rautela)  2013లో సన్ని దేవోల్  హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘భాగ్ జానీ’ సినిమాలో నటించింది. ఈ మధ్యలో కన్నడలో దర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ ఐరావతా’ సినిమాలో నటించింది. \

    ఐనా.. ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆ తర్వాత ‘సనమ్ రే’,
    'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో గ్లామర్ పాత్రలతో అలరించింది. ఎన్ని సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదు ఈ భామకు.




    దాంతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ భామ 2015లో మిస్ దివ కిరీటాన్ని అందుకుని.. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. తాజాగా ఈ భామ.. తెలుగులో సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘బ్లాక్ రోజ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Tollywood, Urvashi Rautela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు