Guess Who: ఈ ఫోటోలో డాన్స్ పోజ్ ఇచ్చిన టాప్ యాంకర్‌ను గుర్తు పట్టండి చూద్దాం..!

టాలీవుడ్ టాప్ యాంకర్

Guess Who: ఈ ఫోటోలో ఉన్న టాప్ యాంకర్ ఎవరో తెలుసా..? కాస్త తీక్షణంగా చూడండి.. చూస్తే మీకే అర్థమైపోతుంది ఎవరో..? గుర్తుకొస్తుంది కదా.. ఇంకా గుర్తు పట్టకపోతే మరోసారి జాగ్రత్తగా చూడండి.. ఎక్కడో చూసినట్లే ఉంటుంది..

  • Share this:
ఈ ఫోటోలో ఉన్న టాప్ యాంకర్ ఎవరో తెలుసా..? కాస్త తీక్షణంగా చూడండి.. చూస్తే మీకే అర్థమైపోతుంది ఎవరో..? గుర్తుకొస్తుంది కదా.. ఇంకా గుర్తు పట్టకపోతే మరోసారి జాగ్రత్తగా చూడండి.. ఎక్కడో చూసినట్లే ఉంటుంది.. పైగా రోజూ మన ఇంట్లోనే ఉండి పలకరించినట్లుంది.. ఇప్పటికి గుర్తొచ్చింది కదా.. ఆమెవరో కాదు టాప్ యాంకర్ సుమ కనకాల. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లో కూడా ఈ పేరుతో పరిచయం ఉంది. అందరి ఇంటి మనిషిలా మారిపోయింది సుమ. యాంకర్‌గానే కాకుండా ఇంట్లో మనిషిలా ఈమెను ఫీల్ అవుతుంటారు అంతా. సుమ కూడా అలాగే అందరిని నవ్విస్తుంటుంది. సరదాగా ఉంటుంది కాబట్టే ఇప్పటి వరకు ఈమెకు తిరుగులేదు.. ఈమె లాంటి యాంకర్ మళ్లీ తెలుగులో వస్తుందా రాదా అనేది కూడా అనుమానమే. ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా సుమ కనకాల ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు యాంకర్‌లుగా ఉన్నపుడు సుమ సినిమాలతో బిజీగా ఉంది.. మధ్యలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ మధ్య తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకుంది సుమ. పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్.

అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ. ఈ ఫోటో కూడా అప్పుడు దిగిందే. స్కూల్ ఏజ్‌లో ఉన్నపుడే డాన్సులో కూడా శిక్షణ తీసుకుంది సుమ. అక్కడ నైపూణ్యం సాధించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. నిజానికి అప్పట్లో చాలా సినిమాలలో సుమకు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు మాత్రం హీరోయిన్ అవ్వాలని.. స్టార్ అయిపోవాలనే ఆలోచన లేదు.

suma kanakala,suma kanakala twitter,suma kanakala instagram,suma kanakala rare photos,suma kanakala old photos,suma kanakala facebook,suma kanakala videos,suma kanakala pulihora,suma kanakala sri rama navami pulihora,suma kanakala sumakka channel,suma kanakala you tube channel,telugu cinema,సుమ,యాంకర్ సుమ,యాంకర్ సుమ పులిహోర,యాంకర్ సుమ పాత ఫోటోలు
యాంకర్ సుమ ఫోటోస్ (Anchor Suma)


అందుకే కొన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా కేవలం సీరియల్స్ వైపు అడుగులేసింది. దాంతో పాటు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది సుమ కనకాల. నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె పాత ఫోటోను చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: