Home /News /movies /

DO THE TOLLYWOOD HEROES HAVE THE COURAGE TO QUESTION ANDHRA PRADESH CHIEF MINISTER JAGAN ON TICKET ISSUE BK SR

AP CM Jagan | Tollywood : జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించే ధైర్యం మ‌న హీరోల‌కు ఉందా.. ఇప్ప‌టికైనా ఒక్క‌తాటిపైకి వ‌స్తారా?  

AP Cm Jagan Photo : Twitter

AP Cm Jagan Photo : Twitter

AP CM Jagan | Tollywood : మన హీరోలు సినిమాల్లో చేసే యాక్ష‌న్ ప్ర‌స్తుతం బ‌య‌ట జ‌రిగే విష‌యాల‌పై రియాక్ట్ అవ‌డానికి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి పోరాటాలు చేసే మ‌న హీరోలు ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల‌న ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చి అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఒక్కతాటిపైకి రాలేకపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అప్పుడెప్పుడో ముఠామేస్త్రి సినిమాలో త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ముఖ్య‌మంత్రినే త‌మ ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించుకునే సీన్ ఇప్ప‌టికి స‌గ‌టు తెలుగు సినిమా అభిమాని గుండెల్లో అలా పాతుకుపోయింది. విల‌న్లునే కాకుండా రాజకీయాల నాయ‌కుల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను, ప్ర‌ధాన మంత్రుల‌ను కూడ తెర‌పై త‌మ హీరోయిజంతో మెప్పించి అబ్బ ఏం చేశాడురా మన హీరో అని స‌గ‌టు అభిమాని సంతృప్తిగా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేలా చేస్తారు మ‌న తెలుగు హీరోలు అండ్ ద‌ర్శ‌కులు. మొన్న‌టికి మొన్న భ‌ర‌త్ అనే నేను సినిమాలో మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఏ స్థాయిలో త‌న హీరోయిజాన్ని ఏ స్థాయిలో చూపించారో మ‌నంద‌రం తెర‌పై చూశాం. మ‌న తెలుగు హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ (Allu Arjun) ప్ర‌భాస్ మొద‌ల‌గు హీరోలు సినిమాల్లో చేసే యాక్ష‌న్ ప్ర‌స్తుతం బ‌య‌ట జ‌రిగే విష‌యాల‌పై రియాక్ట్ అవ‌డానికి చాలా తేడా ఉంటుంది. సినిమాల్లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి పోరాటాలు చేసే మ‌న హీరోలు ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల‌న ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు ఇబ్బందులు ఎదుర్కొవ‌ల‌సి వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చి అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఒక్కతాటిపైకి రాలేకపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

  ఎవ‌రికి వాళ్లు ప్ర‌శ్నిస్తే త‌మ సినిమాల‌కు ఏం ఇబ్బందులు వ‌స్తాయో అనే భ‌యంతో మ‌న‌కెందుకులే అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సినిమాల్లో ప్ర‌ధాని ద‌గ్గ‌ర నుంచి ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు అంద‌రిని ఎదిరించే మ‌న హీరోలు ఇప్పుడు మాత్రం ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై నొరెత్త‌డానికి ముందుకురావ‌డం లేదు. ప్ర‌భుత్వాన్ని అంద‌రూ క‌ల‌సి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర‌టానికి నోరెత్తే సాహ‌సం కూడా చేయ‌టంలేదు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు అత్యంత ముఖ్య‌మైన ఎగ్జిబిట‌ర్లు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో  ఉన్నారు. ఎంత పెద్ద హీరో సినిమా అయిన థియేట‌ర్స్ లేక‌పోతే ఏం ఉండ‌దు అందుకు ఇప్పుడు ఎగ్జిబిట‌ర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అయిన‌ప్ప‌టికి మ‌న హీరోలంద‌రు ఒక్క‌తాటిపైకొచ్చి క‌నీసం ముఖ్య‌మంత్రిని క‌లిసి ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప‌ట్ల మ‌రియు ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాకారం కావాల‌నేదానిప‌ట్ల త‌మ అభ్య‌ర్ధ‌న‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం మాత్రం చేయడం లేదు. ఎవ‌రు ఎలా పోయిన  త‌మ సినిమాకు ఎటువంటి అడ్డ‌కులు రాకుండా ఉంటే చాల‌నే దోర‌ణిలో మ‌న హీరోలు ఉన్నార‌నే విమ‌ర్శ‌క‌లు ఇండస్ట్రీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోన్నాయి.

  Telangana | Pushpa : అల్లు అర్జున్‌‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

  ఇండస్ట్రీ స‌మ‌స్య‌లు త‌మ స‌మ‌స్య‌లు కావ‌న‌ట్లు మ‌న హీరోలు ప్ర‌వ‌ర్తిస్తోన్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి. స‌మ‌స్య‌లేవైన ఉంటే డిస్ట్రిబ్యూట‌ర్లు చూసుకుంటారులే ఇది మ‌న స‌మ‌స్య కాద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కానీ సినిమా ప‌రిశ్ర‌మ‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్న ఎగ్జిబిట‌ర్లు.. థియేట‌ర్ల‌లో ప‌నిచేసే సిబ్బంది కోణంలో వీరు ఏ మాత్రం వీరు ఆలోచించ‌టం లేదు. వాస్త‌వానికి మ‌న హీరోల‌కు నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే అంద‌రూ ఒక‌తాటిపైకి వ‌చ్చి టిక్కెట్ రేట్ల‌ను అడ్డ‌గోలుగా కాకుండా ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం నిర్ణ‌యించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి లేఖ రాయ‌వ‌చ్చు. క‌నీసం సోష‌ల్ మీడియా ద్వారా అయిన త‌మ గొంతు వినిపంచ‌వ‌చ్చు. మ‌న తెలుగు హీరోలు అంద‌రూ క‌ల‌సి అలా చేస్తే ప్ర‌భుత్వంపై ఖ‌చ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఈ ప‌ని చేయ‌టానికి కూడా హీరోలుగా చెప్పుకునే వారు ఎవ‌రూ ముందుకు రావ‌టంలేదు. చూడాలి మరి సమీప భవిష్యత్తులో ఏం జరుగనుందో..

  M.Balakrishna, News18,  Hyderabad.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Ap cm jagan, Chiranjeevi, NTR, Prabhas, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు