హోమ్ /వార్తలు /సినిమా /

SP Balu: తన తండ్రి బాలు ఆరోగ్యంపై వస్తోన్న ఆ వార్తలను నమ్మకండి.. ఎస్పీ చరణ్..

SP Balu: తన తండ్రి బాలు ఆరోగ్యంపై వస్తోన్న ఆ వార్తలను నమ్మకండి.. ఎస్పీ చరణ్..

ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ (instagram/photo)

ఎస్పీబీ ఆరోగ్యంపై చరణ్ (instagram/photo)

SP Balasubrahmanyam: తాజాగా చరణ్ తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వివిధ మాధ్యమాలు వారికి తోచినట్టు రాస్తున్నారు. ఇక తన తండ్రి హెల్త్ విషయమై ఏ విషయమైన.. మా ద్వారా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.

  SP Balasubrahmanyam Health Condition |  గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నాయి. ఆయన మెల్లమెల్గగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు. అలాగే ఈయన ఆరోగ్యం గురించి తరుచూ ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఐతే.. ప్రస్తుతం బాలు కరోనా నుంచి కోలుకున్నా.. ఇప్పటికీ ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ లేవని చెప్పారు. తాజాగా చరణ్ తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వివిధ మాధ్యమాలు వారికి తోచినట్టు రాస్తున్నారు. ఇక తన తండ్రి హెల్త్ విషయమై ఏ విషయమైన.. మా ద్వారా మీడియాకు తెలియజేస్తామని చెప్పారు.

  ఐతే.. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు లేవు. అందుకే హెల్త్ విషయమై అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఐతే.. కొన్ని మీడియా సంస్థలు వార్తలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారో తెలియదు కానీ.. నాన్నకు సంబంధించిన ఏ వార్తైనా ముందుగా నేను మీడియాకు తెలియజేస్తున్నానన్నారు. మరోవైపు తన తండ్రి బాలు ఆరోగ్య పరిస్థితిపై కొన్ని మీడియాలు ఆయనకు ఊపిరితిత్తుల మార్పుకు సంబంధించిన చికిత్స్ అందిస్తున్నట్టు రాసారు. దయచేసి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఏ విషయమైన నేను కానీ హాస్పిటల్ వర్గాలు కానీ అఫీసియల్‌గా ప్రకటన చేసిన విషయాలనే ప్రచురించాలని కోరారు. కొంత మంది అత్యుత్సాహంతో రాసే తప్పుడు వార్తలతో నాకు వందలాదిగా కాల్స్ వస్తున్నాయి. ఒక అసత్య ప్రచారం మూలంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కాల్స్‌కు సమాధానం చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. తన తండ్రి ఆరోగ్య విషయంలో ఏ మ్యాటరైనా నేను కానీ.. నా  వ్యక్తిగత కార్యదర్శి ద్వారా మీరు తెలుసుకోవచ్చు అన్నారు. అభిమానుల ఆశీస్సులతో నాన్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరం ఆశిద్దాం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: SP Balasubrahmanyam, SP Charan Singer, Tollywood

  ఉత్తమ కథలు