Home /News /movies /

DJ TILLU CLOSING WW COLLECTIONS AND SIDDHU JONNALAGADDA SCORED HUGE HIT PK

DJ Tillu Closing WW collections: ‘డిజే టిల్లు’ క్లోజింగ్ కలెక్షన్స్.. సైలెంట్‌గా హిట్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ..

డిజే టిల్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ (dj tillu movie)

డిజే టిల్లు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ (dj tillu movie)

DJ Tillu Closing WW collections: బాక్సాఫీస్ దగ్గర టిల్లు రీ సౌండ్ ఓటిటిలో సాగుతుంది. మొన్నటి వరకు థియేటర్స్‌లో రచ్చ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఆహాలోనూ ఆహా అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డిజే టిల్లు (DJ Tillu) బ్లాక్‌బస్టర్ అయిపోయింది.

ఇంకా చదవండి ...
బాక్సాఫీస్ దగ్గర టిల్లు రీ సౌండ్ ఓటిటిలో సాగుతుంది. మొన్నటి వరకు థియేటర్స్‌లో రచ్చ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఆహాలోనూ ఆహా అనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డిజే టిల్లు (DJ Tillu) బ్లాక్‌బస్టర్ అయిపోయింది. ఈ సినిమాకు కొన్న ప్రతీ ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చేసాడు. నాలుగో రోజు నుంచి లాభాల పంట పండుతుంది. సినిమాలో కామెడీగా బాగా పేలడంతో థియేటర్స్ దగ్గర ఆడియన్స్ బాగానే కనిపిస్తున్నారు. భీమ్లా నాయక్ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఓటిటి విడుదలకు ముందు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లనే వచ్చాయి. మూడో వారం కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది డిజే టిల్లు. పవన్ సినిమాకు టికెట్స్ దొరకని వాళ్లకు ఈ సినిమా మంచి ఛాయిస్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రప్ఫాడిస్తున్నాడు డిజే టిల్లు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే హీరో సిద్దు జొన్నలగడ్డే అందించాడు (Sidhhu Jonnalagadda) . తన స్నేహితుడు విమల్ కృష్ణ (Vimal Krishna)తో కలిసి కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. దర్శకుడిగా మాత్రం విమల్ ఉన్నాడు. నరుడి బతుకు నటన నుంచి ఈ సినిమా టైటిల్‌ను డిజే టిల్లుగా మార్చేసారు. నవ్వుకోడానికి టిల్లు ఫుల్ టైమ్ పాస్ అని టాక్ రావడంతో వసూళ్ల పంట పండింది.

ఓవర్సీస్‌ సహా ఇండియాలో కూడా దుమ్ము దులిపేస్తున్నాడు టిల్లు. రవితేజ ఖిలాడి సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది ఇది. దాంతో టిల్లు రప్ఫాడిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో డిజే టిల్లు మూడో వారంలోనూ చెప్పుకోదగ్గ షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. ఉన్న అంచనాలకు.. చేసిన బిజినెస్‌కు.. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పొంతన లేదు. ప్రపంచ వ్యాప్తంగా డిజే టిల్లుకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..

నైజాం: 6.96 కోట్లు
సీడెడ్: 1.72 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.34 కోట్లు
ఈస్ట్: 0.77 కోట్లు
వెస్ట్: 0.79 కోట్లు
గుంటూరు: 0.74 కోట్లు
కృష్ణా: 0.64 కోట్లు
నెల్లూరు: 0.45 కోట్లు

ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్: 13.41 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 1.01 కోట్లు
ఓవర్సీస్: 2.05 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 16.47 కోట్లు షేర్

Khiladi WW closing collections: ‘ఖిలాడి’ క్లోజింగ్ కలెక్షన్స్.. రవితేజకు మరో ఫ్లాప్..


డిజే టిల్లు సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రాన్ని 8.50 కోట్లకు పైగా బిజినెస్ చేసారు. కానీ ఆ మొత్తాన్ని కేవలం 4 రోజుల్లోనే చేరుకుంది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడమే కాకుండా లాభాల పంట పండిస్తుంది డిజే టిల్లు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో భీమ్లా నాయక్ వచ్చే వరకు 2022 బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది డిజే టిల్లు. హాఫ్ మిలియన్ మార్క్ అందుకుని చిన్న సినిమాల సత్తా చూపించింది టిల్లు. మొత్తంగా ఇప్పటికే 8 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, DJ Tillu Movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు