పునర్వవి దీపావళిని ఎవరితో జరుపుకుంటుందో తెలుసా...

Diwali 2019 : ఉయ్యాల జంపాలతో టాలీవుడ్‌కి పరిచయమైన పునర్నవీ భూపాలం... బిగ్‌బాస్ 3తో తెలుగువారికి మరింత దగ్గరైంది. మరి ఆ బ్యూటీ దీపావళిని ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 27, 2019, 8:13 AM IST
పునర్వవి దీపావళిని ఎవరితో జరుపుకుంటుందో తెలుసా...
పునర్నవి (credit - FB - Punarnavi)
  • Share this:
Bigg Boss 2 Punarnavi : దీపావళిని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా జరుపుకుంటారు. కొందరు ఇంటి సభ్యులతో చేసుకుంటే, మరికొందరు స్నేహితులతో జరుపుకుంటారు. మరి బిగ్ బాస్ 3 బ్యూటీ పునర్నవీ భూపాలం ఎలా జరుపుకుంటుందంటే... చిన్నప్పుడు ఆమె మనందరిలాగే టపాసులు కాల్చేది. పెద్దయ్యాక గ్రీన్ దీపావళిని ఇష్టపడుతోంది. పెద్దగా బాణసంచా జోలికి వెళ్లకుండా... చక్కగా దీపాలు వెలిగించి... స్నేహితుల్ని కలిసి... వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ... దీపావళి జరుపుకుంటోంది. స్వీట్లంటే పునర్వవికి చాలా ఇష్టం. అందువల్ల దీపావళికి అందరికీ స్వీట్లు పంచుతానని తెలిపింది. నిజానికి పునర్నవికి దీపావళి, దసరా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే... చిన్నప్పుడు ఈ పండుగలు రాగానే... ఆంధ్రాలోని ఆమె ఇల్లంతా సందడిగా మారిపోయేది. ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాక... ఈ పండుగలు వచ్చినప్పుడు... స్నేహితులు ఆమె ఇంటికి వస్తున్నారు. ఆమెతో కలిసి లంచ్ లేదా డిన్నర్ చేస్తూ... స్వీట్లు తింటూ... సరదాగా గడిపేస్తున్నారు.

మనలాగే పునర్నవి కూడా పర్యావరణానికి హాని చేసే బాణసంచా కాల్చడం అంతగా ఇష్టం లేదట. అందువల్ల ఈ ఏడాది క్రేకర్స్ జోలికి వెళ్లేది లేదంటోంది. ఐతే... దీపావళి నాడు మాత్రం తెలుగమ్మాయిలా తయారై... సంప్రదాయ డ్రెస్సులే వేసుకుంటానని తెలిపింది. పండుగలప్పుడు పట్టులంగాలు, చున్నీ వంటివి వేసుకోవడం తనకు ఇష్టమని తెలిపింది. ఈ ఏడాది పునర్నవి తల్లి... అమెరికా వెళ్లడంతో... స్నేహితులతోనే పండుగ జరుపుకోనున్నట్లు తెలిపింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

దీపావళి వస్తే... ఇళ్లలో పెంచుకున్న కుక్కలు, పిల్లుల వంటివి చాలా భయపడతాయి. అలాంటి వాటిని చూశాక... పునర్నవికి చాలా బాధ కలిగిందట. అందుకే... దీపావలికి క్రేకర్స్ కాల్చడం కరెక్టు కాదని నిర్ణయించుకుందట. ఈ సంవత్సరం కూడా అందరూ ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకోవాలని కోరుతోంది. పిల్లలకు మాత్రమే క్రేకర్స్ వంటివి ఇచ్చి... పెద్దవారు మాత్రం బాణసంచాకు దూరంగా ఉండటం మంచిదంటోంది.

 


Pics : అందాల నయాగరా... సురభి క్యూట్ ఫొటోస్





ఇవి కూడా చదవండి :నేడు హర్యానా సీఎంగా ఖట్టర్, డిప్యూటీ సీఎంగా దుష్యంత్ ప్రమాణ స్వీకారం

Diwali 2019 : అంతటా దీపావళి సందడి... సెలబ్రిటీల విషెస్

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
First published: October 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>