చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటి కన్నుమూత..

2020 చిత్రసీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అందులో బాలీవుడ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. తాజాగా మరో బాలీవుడ్ నటి కాన్సర్‌తో కన్నుమూసింది.

news18-telugu
Updated: July 13, 2020, 7:39 AM IST
చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటి కన్నుమూత..
దివ్య చౌక్సే మరణం (News18/English)
  • Share this:
2020 చిత్రసీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అందులో బాలీవుడ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తాయి. మరోవైపు ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అటు కన్నడ చిత్ర సీమలో ఎంతో భవిష్యత్తు ఉన్న చిరంజీవి సర్జ సడెన్‌గా గుండెపోటుతో మరణించారు.  రీసెంట్‌గా రంజన్ సైగల్ అనే టీవీ నటుడు అనారోగ్యంతో కన్నమూసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా బాలీవుడ్‌లో ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన ప్రముఖ మోడల్, నటి దివ్య చౌక్సే కేన్సర్‌తో నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచింది. దివ్యచౌక్సే మృతిపై ఆమె బంధువు అమిష్ వర్మ ధృవీకరించారు. దివ్య మృతిపై పలువురు నటులు తమ సంతాపం తెలియజేసారు.దివ్య చౌక్సే కన్నుమూసే కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం గుండెలను పిండేసే ఓ విషాదకర పోస్ట్ పెోట్టారు.

దివ్య చౌక్సే లాస్ట్ పోస్ట్ (Instagram/Photo)


కేన్సర్‌తో నేను కొన్ని నెలలుగా పోరాడుతూ ఇపుడు మరణం అంచుల మీదున్నాను దివ్య చౌక్సే బై అంటూ రాయడం అభిమానులను కలిచి వేసింది. దివ్య చౌక్సే సినిమాలకు ముందు పలు యాడ్ ఫిల్మ్స్2 , టెలివిజన్ షోలతో ప్రేక్షకులకు దగ్గరైంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 7:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading