DISTRIBUTORS OF BAAHUABLI AND KGF BAG THE ALLU ARJUN PUSHPA HINDI THEATRICAL RIGHTS SR
Allu Arjun | Pushpa : బాహుబలి నిర్మాతల చేతుల్లో పుష్ప హిందీ థియేట్రికల్ రైట్స్.. అధికారిక ప్రకటన..
Allu Arjun Pushpa Photo : Twitter
Allu Arjun | Pushpa : ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు.
అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న విడుదల చేశారు. చంద్రబోస్ రాయగా.. నకాష్ ఆజిజ్ పాడారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు.
తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక మరోవైపు ఈ చిత్రం విడుదలకు దగ్గరవ్వడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా ఓ భారీ మాస్ సాంగ్‌ను చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం అల్లు అర్జున్ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్లో పాల్గోంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.
ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.
ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలకానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.