Bigg Boss 5 Telugu Ram Charan: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ పై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా.. మొదటి వారం ఎలిమినేట్ లో బోల్డ్ బ్యూటీ సరయు హౌస్ నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక రెండో వారం కూడా పూర్తవడానికి రాగా ఇందులో ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరా అని తెగ ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోలో కి రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈరోజు బిగ్ బాస్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో రామ్ చరణ్ ఎంట్రీ కనిపించింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన మాస్ట్రో మూవీ నటీనటులు కూడా గెస్ట్ లుగా పాల్గొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ గా మారింది. అందులో రామ్ చరణ్ తో పాటు నితిన్, తమన్నా, నభా నటేష్ లు కనిపించారు. ఇక ప్రస్తుతం మాస్ట్రో సినిమా విడుదల సందర్భంగా ఈ సినీ బృందం వచ్చారని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: అర్ధపావు భాగ్యంకు అండగా కార్తీకదీపం అభిమానులు.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
మరి రామ్ చరణ్ రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా. చెర్రీ రావడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తుంది. అదేంటో కాదు బిగ్ బాస్ గురించి మరో ప్రకటన ఇవ్వడానికి వచ్చాడని తెలుస్తుంది. ఈ సీజన్ 5 పూర్తయిన తర్వాత మరో మినీ బిగ్ బాస్ షో ను ప్రారంభించనున్నారని తెలుస్తుంది. ఇక అది కేవలం 50 రోజులు మాత్రమే జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కూడా ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రెటీలను, టీవీ యాంకర్ లను మాత్రమే తీసుకుంటారని అంతే కాకుండా టాప్ ఫోర్ స్థానాల్లో నిలిచిన వారికి కూడా ఆరో సీజన్ లో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి:హమీదాకు శ్రీరామచంద్ర మసాజ్.. బిగ్ బాస్ షోలో రొమాన్స్ స్టార్ట్ అయ్యిందోచ్!
ఇక ఈ షోను టీవీ లో కాకుండా ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రామ్ చరణ్ ఓ టీవీ ఛానల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బాధ్యతలు తీసుకోగా.. ఈ హాట్ స్టార్ ను మరింత డెవలప్ చేయడానికి మినీ బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎంత నిజముందో లేదో తెలియాలంటే రామ్ చరణ్ నోటి నుండే వినాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Telugu, Disney plus hotstar, Mastro team, Nithin, Ram Charan, Star Maa, Tamannah