తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే మరణించిన నటుడు.. షాక్‌లో ఇండస్ట్రీ..

20 ఏళ్లు.. లోకాన్ని అప్పుడ‌ప్పుడే చూస్తున్న వ‌య‌సు అది. అప్పుడు కానీ మ‌ర‌ణిస్తే క‌న్న త‌ల్లిదండ్రుల‌కు అంత‌కంటే మ‌హా విషాదం మ‌రోటి ఉండ‌దు. ఇక ఆయ‌న న‌టుడు అయితే.. అప్ప‌టికే స్టార్ డ‌మ్ తెచ్చుకున్న వాడైతే ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని న‌ష్ట‌మే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 8, 2019, 12:47 PM IST
తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే మరణించిన నటుడు.. షాక్‌లో ఇండస్ట్రీ..
కామెరూన్ బోయ్‌సే ఫైల్ ఫోటో
  • Share this:
20 ఏళ్లు.. లోకాన్ని అప్పుడ‌ప్పుడే చూస్తున్న వ‌య‌సు అది. అప్పుడు కానీ మ‌ర‌ణిస్తే క‌న్న త‌ల్లిదండ్రుల‌కు అంత‌కంటే మ‌హా విషాదం మ‌రోటి ఉండ‌దు. ఇక ఆయ‌న న‌టుడు అయితే.. అప్ప‌టికే స్టార్ డ‌మ్ తెచ్చుకున్న వాడైతే ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని న‌ష్ట‌మే. ఇప్పుడు ఇదే జ‌రిగింది. 20 ఏళ్ల‌కే ఓ కుర్ర న‌టుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. హాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్ల‌కు కామెరూన్ బోయ్‌సే అనే యువ న‌టుడితో కూడా ప‌రిచ‌యం ఉండే ఉంటుంది. సినిమాల కంటే కూడా టీవీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయ‌న‌. ముఖ్యంగా డిస్నీ రూపొందించే సీరియ‌ల్స్‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ఈ 20 ఏళ్ల యువ త‌రంగం.ఇప్పుడు ఈయ‌న లేడు.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా మెద‌డు సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఈ కుర్రాడు.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసాడు. కామెరూన్ మ‌ర‌ణం హాలీవుడ్‌ను కుదిపేసింది. అక్క‌డి వాళ్ల‌ను కంట‌త‌డి పెట్టిస్తుంది. ఇంత చిన్న వ‌య‌సులో మృత్యువు కాటేయ‌డంతో అంతా విషాదంలో మునిగిపోయారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నారు. 2008లో 9 ఏళ్ల వ‌య‌సులో మిర్ర‌ర్స్ అనే సినిమాతో హాలీవుడ్‌లో అడుగు పెట్టాడు కామెరూన్. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్ కూడా చేస్తూ వ‌స్తున్నాడు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>