Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 14, 2020, 3:38 PM IST
సుశాంత్ సింగ్ దిశా సలియాన్ (sushant singh disha salian)
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసు కూడా చాలా మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే చాలా విషయాలు బయటికి వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ఏం లేదు.. అన్నీ అబద్ధాలే.. ఆత్మహత్య చేసుకోవడం వల్లే దిశా చనిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఈమె డెడ్ బాడీ దొరికినపుడు ఒంటిపై బట్టల్లేవు.. రేప్ జరిగింది అంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టి పారేసారు కుటుంబ సభ్యులు. ముంబై పోలీసులు కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సుశాంత్ సింగ్ దిశా సలియాన్ (sushant singh disha salian)
ఇదిలా ఉంటే దిశా కేసులో మరో సంచలన ట్విస్ట్ వచ్చింది. అదే ఆమె తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. తాజాగా ఆయన ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదు చేసాడు. తమ కూతురు మరణంపై అనేక పుకార్లు వ్యాప్తి చేసినందుకు ఈ ముగ్గురు వ్యక్తులపై ఆగస్ట్ 14న ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై పోలీసులు వేగంగా స్పందించారు. విచారణను వేగవంతం చేశారు. కావాలనే కొందరు సుశాంత్ సింగ్ మరణంతో దిశా చావును కూడా లింక్ పెడుతున్నారని.. ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ దిశా సలియాన్ (sushant singh disha salian)
వాట్సాప్ ఫార్మర్డ్ మెసేజ్లతో పాటు సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టి తమ కూతురు పరువు తీస్తున్నారని ఆయన ఆవేదన చెందాడు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తమను ఎంతగానో వేధిస్తున్నాయంటూ ఆయన వాపోయాడు. దాంతో ముంబై పోలీసులు పునీత్ వసిష్ట, సందీప్ మలాని, నమన్ శర్మలపై కేసులు పెట్టారు. ఐటీచట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. FIR కూడా నమోదు చేస్తామని చెప్పారు పోలీసులు. జూన్ 8న దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 14, 2020, 3:38 PM IST