సుశాంత్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్...పోలీసులకు దిశా తండ్రి ఫిర్యాదు

Sushanth Singh Rajput Death Case: సుశాంత్ సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసుపై కూడా ముంబై పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసిన వారు ఎవరైనా తమకు ఆ వివరాలు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: August 5, 2020, 10:35 PM IST
సుశాంత్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్...పోలీసులకు దిశా తండ్రి ఫిర్యాదు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా
  • Share this:
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. సుశాంత్ సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసుపై కూడా ముంబై పోలీసులు దృష్టిసారించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసిన వారు ఎవరైనా తమకు ఆ వివరాలు అందచేయాలని ముంబై పోలీసులు బుధవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ (28) జూన్‌ 8న ముంబైలోని మలద్‌ ప్రాంతంలో బహుళఅంతస్తుల భవనం పైనుంచి నుంచి కిందపడి మరణించారు. మల్వాని పోలీసులు దిశ మృతిపై యాక్సిడెంటల్‌ డెత్‌ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

sushanth manager disha, sushanth disha death, sushanth death case, sushanth death news, sushanth case updates, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సుశాంత్ మాజీ మేనేజర్ దిశా, దిశా సలియన్, ముంబై పోలీసులు
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియన్(ఫైల్ ఫోటో)


ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంతో పాటు..మాజీ మేనేజర్ దిశా సలియన్ మరణంపై కూడా దర్యాప్తు జరపాలని సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరి మరణాలకు సంబంధం ఉందని, వీరి మరణాల వెనుకున్న అదృశ్య శక్తులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దిశ సలియన్‌ను అత్యాచారం చంపేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె శరీరంపై అసహజ గాయాలున్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది.

దిశ మరణంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె తండ్రి దిశ సతీష్ సలియన్ మల్వాని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాన్ని మీడియా మానసిక వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. ముంబై పోలీసుల దర్యాప్తుపై తమ నమ్మకానికి సంబంధించి పదేపదే ప్రశ్నిస్తూ కొందరు జర్నలిస్టులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దిశా మరణం వెనుక కుట్ర ఉన్నట్లు తాము భావించడం లేదని స్పష్టంచేశారు.
Published by: Janardhan V
First published: August 5, 2020, 10:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading