బాలీవుడ్ నటి దిశా పటానీ వ్యక్తిగత బాడీగార్డ్ ఓవర్ యాక్షన్ చేశాడు. దిశా పటానీని ఫోటో తీస్తున్న ఓ కెమరా జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా దిశా పటానీని ఫోటో తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. కారు దగ్గర నిల్చొని ఫోటో తీస్తున్న ఓ ఫోటోగ్రాఫర్‌ని బాడీగార్డ్ బలంగా నెట్టేశాడు. బాడీగార్డ్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ... అతనితో వాగ్వాదానికి దిగాడు సదరు ఫోటోగ్రాఫర్. మిగిలిన ఫోటోగ్రాఫర్లు కూడా బాలీవుడ్ నటి బాడీగార్డ్ ఓవర్ యాక్షన్ పట్ల తమ నిరసన వ్యక్తంచేశారు. క్షమాపణ చెప్పకపోతే దిశా పటానీ కార్యక్రమాలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిశా పటానీ మేనేజర్ జరిగిన ఘటన పట్ల క్షమాపణ చెప్పారు.
న Viral Bhayani (@viralbhayani) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.